కాంగోలో హింసాకాండ.. తొమ్మిది మంది సైనికులతో పాటు 72 మంది మృతి

Published on Wed, 07/17/2024 - 09:37

కాంగోలోని ఒక గ్రామంలో సాయుధ దుండగులు జరిపిన  హింసాకాండలో తొమ్మిది మంది సైనికులతో పాటు 72 మంది సామాన్య పౌరులు మృతి చెందారు. కాంగో రాజధాని మిలీషియాకు సమీపంలో జరిగిన ఈ  హింసాయుత దాడిలో 72 మంది మృతి చెందారని స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు.

కాంగోలో ఇటీవలి కాలంలో ప్రత్యర్థి వర్గాల మధ్య హింస తీవ్రమైంది. రాజధాని కిన్షాసాకు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్సాలే గ్రామంలో ఈ  హింసాయుత ఘటన చోటుచేసుకుంది. కిన్సాలే క్వేమౌత్ ప్రాంతంలో టెకే- యాకా కమ్యూనిటీల మధ్య రెండేళ్లుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా వందలాది మంది పౌరులు బలి అవుతున్నారు. దాడికి పాల్పడుతున్న వారు మొబోండో మిలీషియా సభ్యులని తెలుస్తోంది. వీరు యాకా వర్గంలోని ప్రజలను రక్షించేవారిగా పేరొందారు.

క్వామౌత్ ఏరియా ప్రావిన్షియల్  అధికారి డేవిడ్ బిసాకా  మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల వ్యవధిలో రెండోసారి మిలీషియాను తరిమికొట్టడంలో సైన్యం విజయవంతమైందన్నారు. 2024 ఏప్రిల్‌లో కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెకెడి సమక్షంలో కాల్పుల విరమణపై  ఒప్పందం జరిగినప్పటికీ, ఈ గ్రూపుల  మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో అవి తీవ్రరూపం దాల్చాయి. దేశంలోని తూర్పు ప్రాంతంలో చెలరేగుతున్న హింసను నిరోధించడానికి కాంగో సైన్యం నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలోని బంగారం ఇతర వనరులలో వాటా  కోసం ఇరు వర్గాలు పరస్పరం పోరాటం సాగిస్తున్నాయి.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)