Breaking News

Indonesia: విరిగిపడిన కొండచరియలు.. ఏడుగురు మృతి

Published on Sun, 01/25/2026 - 08:46

జావా: ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రావిన్స్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో వివిధ ప్రాంతాల్లో  ఏడుగురు మరణించగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారని తెలుస్తోంది. పశ్చిమ బాండుంగ్ ప్రాంతంలోని పసిర్లాంగు గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో సుమారు 30 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి.

ఇండోనేషియా విపత్తు నివారణ సంస్థ నివేదికల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బురాంగ్రాంగ్ పర్వత వాలులలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరద నీరు, బురద, రాళ్లు గ్రామంపైకి దూసుకొచ్చాయి. గ్రామంలోని ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో సంభవించిన ఈ విపత్తులో 30 ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు పెద్ద శబ్దాలు వినిపించాయని, ఆ వెంటనే ఆకస్మిక వరదలు గ్రామాన్ని ముంచెత్తాయని స్థానిక పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

‘గల్లంతైన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మేము సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టామని’  జాతీయ విపత్తు నివారణ సంస్థ (బీఎన్‌పీబీ) ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు. ఇండోనేషియా సైన్యం, ప్రాంతీయ విపత్తు నిర్వహణ బృందాలు, వాలంటీర్లు, స్థానిక ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బురద, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు బృందాలు శ్రమిస్తున్నప్పటికీ, ప్రతికూల వాతావరణం  సవాలుగా మారింది.

మరిన్ని కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 30 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ప్రభావం ఉన్నట్లు అంచనా. పశ్చిమ జావా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కరావాంగ్ తదితర జిల్లాల్లో నదులు పొంగిపొర్లుతుండటంతో వరదలు సంభవించాయి. గత నెలలో ఉత్తర సుమత్రా, ఆచే ప్రాంతాల్లో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 1,100 మందికి పైగా మరణించారు. ఈ విషాదం మరువక ముందే తాజా ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 

ఇది కూడా చదవండి: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)