Breaking News

విడాకుల సెటిల్మెంట్‌కు రూ. ఆరు వేల కోట్లు! 

Published on Sat, 07/25/2026 - 04:20

సియోల్‌: ఒకటి కాదు.. రెండు కాదు... వంద కూడా కాదు! దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు! ఇదీ దక్షిణ కొరియాకు చెందిన చెయ్‌–టే–వోన్‌ తన మాజీ భార్యకు చెల్లించాల్సిన సెటిల్మెంట్‌ మొత్తం! ఈ మేరకు సియో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి... దక్షిణ కొరియాకు చెందిన భారీ టెక్‌ కంపెనీ ఎస్‌కే గ్రూపు ఛైర్మన్‌ ఛేయ్‌–టే–వోన్‌. దేశ మాజీ ప్రధాని రో–టే–వూ కూతురు రో–సో–యాంగ్‌ను 1988లో పెళ్లి చేసుకున్నాడు. 

వీరికి ముగ్గురు పిల్లలు కూడా. అయితే తనకు ఇంకో మహిళతో సంబంధం ఉందని, బిడ్డ కూడా పుట్టిందని తెలిపిన ఛేయ్‌ 2017లో విడాకుల కోసం కోర్టుకెక్కాడు. విచారణ తరువాత హైకోర్టు గత ఏడాది తీర్పునిస్తూ రో–సో–యాంగ్‌కు సెటిల్మెంట్‌ కింద 130 కోట్ల వాన్‌లు (రూ.8563 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. భరణం కింద చెల్లించాల్సిన 200 కోట్ల వోన్‌లు దీనికి అదనం. అయితే సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరడంతో మరోసారి విచారణ జరిగింది.

 ఛేయ్‌ చెల్లించాల్సిన సెటిల్మెంట్‌ మొత్తం సుమారు ఆరువేల కోట్ల రూపాయలకు తగ్గింది. రో–సో–యాంగ్‌ తండ్రి ప్రధానిగా ఉండగా ఎస్‌కే గ్రూపుకు సుమారు 3000 కోట్ల వాన్‌లు అక్రమంగా చెల్లించాడని హైకోర్టు గుర్తించింది. అయితే ఆ మొత్తాన్ని కంపెనీ వృద్ధికి చట్టబద్ధంగా చెల్లించిన మొత్తంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైతేనేం... ఛేయ్‌ – రో–సో–యాంగ్‌ల విడాకుల సెటిల్మెంట్‌ మొత్తం ఓ రికార్డు సృష్టించింది. ఈ ఏటి మేటిగా దక్షిణ కొరియా మీడియా వర్ణిస్తోంది!  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)