Breaking News

అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు.. 50 మందికిపైగా మృత్యువాత

Published on Wed, 09/13/2023 - 12:03

వియాత్నంలోని అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దేశ రజధాని హనోయిలోని 9 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో 50 మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరో 70 మందిని అధికారులు రక్షించారు.

మంగళవారం రాత్రి 11.30 గంటలకు భవనంలోని పార్కింగ్‌ ఏరియాలో మొదలైన మంటలు క్షణాల్లోనే అపార్ట్‌మెంట్‌ మొత్తం వ్యాపించాయి. భవనం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. బిల్డింగ్‌లో 45 కుటుంబాలు నివసిస్తుండగా ప్రమాద సమయంలో అందరూ ఇళ్లలోనే ఉన్నారు. నిద్రమత్తులో ఉన్న నివాసితులు తేరుకొని సాయం కోసం గట్టిగా కేకలు వేశారు.

అయితే  అపార్ట్‌మెంట్ నుంచి తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని, ఈ కారణంతోనే మరణాలు భారీగా సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

అయితే అపార్టమెంట్‌ ఇరుకైన గల్లీలో ఉండటంతో అక్కడికి చేరుకునేందుకు అగ్నిమాపక సిబ్బందికి కష్టమవుతోంది. దీంతో  అగ్నిమాపక వాహనాలను భవనానికి 300 నుంచి 400 మీటర్ల దూరంలో నిలిపి ఉంచి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)