Breaking News

మాలీలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ కలకలం

Published on Sat, 11/08/2025 - 10:16

పశ్చిమ ఆఫ్రికా దేశం ఐదుగురు భారతీయుల కిడ్నాప్‌ వార్త కలకలం రేపింది. ఈ విషయాన్ని భద్రతా వర్గాలు  శుక్రవారం  ధృవీకరించాయి. ఒక పక్క అశాంతి,  జిహాదీ హింసతో అల్లాడి పోతుండగా మరోపక్క  కోబ్రీ సమీపంలో ఉగ్రవాదుల చేతిలో భారతీయుల కిడ్నాప్‌ మరింత ఆందోళన రేపింది.   

పశ్చిమ మాలిలోని కోబ్రీ సమీపంలో గురువారం కార్మికులను ముష్కరులు కిడ్నాప్ చేశారని, వారు విద్యుదీకరణ ప్రాజెక్టులపై పనిచేస్తున్న కంపెనీలో పనిచేస్తున్నారని భద్రతా వర్గాలు AFPకి తెలిపాయి. మరోవైపు బాధితులు పనిచేస్తున్న కంపెనీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ముందుజాగ్రత్త చర్యగా మిగిలిన వారిని రాజధాని బమాకోకు సురక్షితంగా తరలించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తామే ఈ కిడ్నాప్‌ చేసినట్టు ఇప్పటివరకు ఏ గ్రూపు  ప్రకటించలేదు.

2012 నుండి తిరుగుబాట్లు, ఘర్షణలతో అట్టుడుడుతున్న దేశంలో విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్‌లు సర్వసాధారణంగా మారిపోయాయి. అల్‌ఖైదాదీ సంబంధిత గ్రూప్ ఫర్ ది సపోర్ట్ ఆఫ్ ఇస్లాం అండ్ ముస్లింస్  (JNIM) జిహాదీలు సెప్టెంబర్‌లో బమాకో సమీపంలో ఇద్దరు ఎమిరాటీ జాతీయులను మరియు ఒక ఇరానియన్‌ను కిడ్నాప్ చేశారు.50 మిలియన్ల  డాలర్ల చెల్లింపు తరువాత వారిని  గత వారం విడుదల చేశారు.
 

#

Tags : 1

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)