Breaking News

అమెరికాలో భూకంపం.. భయంతో జనం పరుగులు 

Published on Tue, 09/23/2025 - 06:32

బర్కిలీ: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే, బర్కిలీకి సమీపంలో సోమవారం వేకువజామున 3 గంటల సమయంలో భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.3గా నమోదైంది. శాన్‌ఫ్రాన్సిస్కో, బర్కిలీతోపాటు అక్కడికి 161 కిలోమీటర్ల దూరంలోని సలినాస్‌లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. తీవ్ర భూప్రకంపనలతో భయంతో నిద్ర నుంచి మేల్కొన్న జనం పరుగుపరుగున ఇళ్లు వదిలి వీధుల్లోకి చేరుకున్నారు. 

దుకాణాల షెల్ఫుల్లోని ఉన్న వస్తువులు కింద పడిపోయాయి. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఇళ్లు కదులుతున్నట్లుగా ఉన్న వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. భూకంపం కారణంగా కొద్దిసేపు రైళ్లను తక్కువ వేగంతో నడిపారు. అయితే, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. నష్టం గురించిన సమాచారం కూడా లేదన్నారు. భూకంప కేంద్రం బర్కిలీకి ఆగ్నేయంగా 1.6 కిలోమీటర్ల దూరంలో, సుమారు 7.7 కిలోమీటర్ల లోతులో ఉంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)