Breaking News

కిడ్నాపైన విద్యార్థులు 300 పైమాటే..

Published on Sun, 11/23/2025 - 06:55

అబుజా: నైజీరియాలోని క్రైస్తవ మిషనరీ స్కూలు నుంచి శుక్రవారం వేకువజామున సాయుధులు కిడ్నాప్‌ చేసిన విద్యార్థుల సంఖ్య 300 పైమాటేనని అధికారులు శనివారం తెలిపారు. నైగర్‌ రాష్ట్రం పపిరి ప్రాంతంలోని సెయింట్‌ మేరీ మిషనరీ స్కూలులో 303 మంది విద్యార్థులతోపాటు 12 మంది టీచర్లను కూడా సాయుధులు తీసుకెళ్లారన్నారు. మొదట 215 మంది విద్యార్థులను తీసుకెళ్లారని తాము భావించామని, అయితే, కిడ్నాప్‌ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన మరో 88 మంది విద్యార్థులను కూడా సాయుధులు బలవంతంగా తీసుకెళ్లినట్లు గుర్తించామన్నారు. 

బాలురతోపాటు బాలికలు కూడా వీరిలో ఉన్నారు. అంతా 10 నుంచి 18 ఏళ్ల ఏళ్లలోపు వారని వివరించారు. పొరుగునే ఉన్న కెబ్బి రాష్ట్రం మాగా పట్టణంలోని ఓ పాఠశాల నుంచి వారం క్రితం 25 మంది పిల్లలను సాయుధులు ఎత్తుకెళ్లడం తెల్సిందే. ఈ కిడ్నాప్‌ ఘటనలకు బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించుకోలేదని అధికారులు తెలిపారు. ప్రభుత్వ హెచ్చరికలను ఖాతరు చేయకుండా తాము స్కూలు ఓపెన్‌ చేశామంటూ వస్తున్న వార్తలను మిషనరీ అధికారి ఒకరు ఖండించారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసు కూడా అందలేదని స్పష్టం చేశారు. విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయని ఓ అధికారి తెలిపారు. 

డబ్బు కోసమేనా? 
ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో సాయుధ గ్రూపులు పేరుతోపాటు డబ్బు కోసం స్కూళ్లను టార్గెట్‌ చేసుకుంటున్నాయి. సాయుధ ముఠాలు, జిహాద్‌ గ్రూపులు క్రైస్తవులనే లక్ష్యంగా చేసుకుంటున్నందున ఆ దేశానికి నిధులను నిలిపి వేస్తామంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించడం గమనార్హం. అయితే, సాయుధులు ఎత్తుకెళ్తున్న పిల్లల్లో క్రైస్తవులతోపాటు ముస్లింలు కూడా ఉంటున్నారు. 2014లో జిహాదీ గ్రూపు బోకో హరామ్‌ ఓ స్కూలుపై దాడి చేసి 276 మంది బాలికలను అపహరించడం అంతర్జాతీయంగా సంచలనం రేపింది. 

నాలుగేళ్ల తర్వాత మరో స్కూలు నుంచి 110 మంది బాలికలను ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత సంక్షోభం నెలకొన్న రాష్ట్రాల్లో డజను వరకు సాయుధగ్రూపులు పుట్టుకొచ్చాయి. ఇవి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లను ఎంచుకుని, పిల్లల కిడ్నాప్‌లకు పాల్పడుతున్నాయి. చిబోక్‌ దాడి అనంతరం దాదాపు 1,500 మంది విద్యార్థులను కిడ్నాప్‌ చేసిన సాయుధ ముఠాలు, డబ్బు తీసుకుని వీరిలో చాలామందిని వదిలేశాయి. మత విశ్వాసాల కంటే డబ్బుకే ఈ గ్రూపులు ప్రాధాన్యమిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)