Breaking News

ఘోరం.. గ్రామస్థులపై కాల్పులు 30 మంది మృతి

Published on Sun, 01/04/2026 - 20:52

నైజీరియాలో ఘోరం జరిగింది. అక్కడి ఓ గ్రామంపై క్రిమినల్ గ్యాంగులు విరుచుకపడ్డాయి. గ్రామస్థులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి వారి ఇళ్లను దగ్ధం చేశాయి. ఈ దుండగులు జరిపిన కాల్పుల్లో దాదాపు 30 మంది పౌరులు మృతిచెందారు. వీరి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అక్కడి పోలీసులు తెలిపారు.  

నైజీరియా దేశంలోని నార్త్‌ నైజిర్ రాష్ట్రంలో  కసువాన్‌జీ గ్రామంలోని ప్రజలపై  శనివారం సాయంత్రం దోపిడి దొంగలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం వారి ఇళ్లను తగలబెట్టారు. అక్కడి దుకాణాలను లూటీ చేసి, పిల్లలను ఆడవారిని అపహరించారు. ఈ కాల్పుల్లో 30 మందికి పైగా మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించగా వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

అపహరించిన వారికోసం గాలింపులు చేపడుతున్నామని దాడులు జరిగిన ప్రాంతంలో ప్రత్యేక బలగాలను మెహరించామని అక్కడి పోలీసులు తెలిపారు. అయితే దాడులు జరుగుతున్న సమాచారం పోలీసులకు తెలిపామని అయినప్పటికీ సరైన సమయానికి వారు అక్కడికి  చేరుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా నైజిరియాలో చాలాకాలంగా గ్యాంగ్‌ దాడుల కాల్పులు, పిల్లలు, ఆడవారి అపహరణ చాలా కామన్‌గా మారింది. ఉత్తర నైజిరియాలో పేదరికం తీవ్రంగా ఉంది. దీంతో అక్కడి యువత క్రిమినల్ గ్యాంగులలో చేరుతూ దోపిడీ అపహరణలు జీవన ఆధారంగా మలుచుకుంటున్నారు.  పిల్లలను, ఆడవారికి అపహరించి రాన్సమ్ ( విడుదలకు చెల్లించే డబ్బు) డిమాండ్ చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)