Breaking News

పాక్‌ రైలు హైజాక్‌: 50 నిమిషాలు నరకమే.. ప్రయాణీకుడి ఆవేదన

Published on Thu, 03/13/2025 - 07:05

ఇస్లామాబాద్‌: సంచలనం సృష్టించిన రైలు హైజాక్‌ ఉదంతానికి తెర దించినట్టు పాకిస్తాన్‌ బుధవారం ప్రకటించింది. క్వెట్టా నుంచి పెషావర్‌ వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) చెరబట్టడం, పలువురు ప్రయాణికులను కాల్చి చంపి 215 మందిని బందీలను చేసుకోవడం తెలిసిందే. జైళ్లలో ఉన్న తమ నేతలను 48 గంటల్లోగా వదిలేయకపోతే బందీలందరినీ చంపేస్తామని అల్టిమేటం కూడా జారీ చేసింది. ప్రయాణికులందరినీ సైనిక ఆపరేషన్‌ ద్వారా బుధవారం సాయంత్రానికల్లా బీఎల్‌ఏ చెర నుంచి విడిపించినట్టు ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ ప్రకటించారు.

ఈ సందర్బంగా ‘ఘటనా స్థలిలో ఉన్న 33 మంది మిలిటెంట్లను ఆర్మీ స్నైపర్లు హతమార్చారు. ఆ క్రమంలో నలుగురు సైనికులను కోల్పోయాం. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మిలిటెంట్లు రైలును హైజాక్‌ చేశారు. ఆ క్రమంలో 27 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకున్నారు’ అని చెప్పారు. ట్రైన్‌తో పాటు ఘటనా స్థలిని బాంబ్‌ డిస్పోజల్‌ బృందాలు జాగ్రత్తగా జల్లెడ పడుతున్నాయన్నారు. దాడికి కారకులను, వారిని పెంచి పోషిస్తున్న వారిని వెంటాడి వేటాడతామని ప్రకటించారు.

భిన్న వాదనలు 
ఆపరేషన్‌ విజయవంతమైందన్న ప్రకటనపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. వేర్పాటువాదులు ఆత్మాహుతి బాంబులుగా ఇప్పటికీ ప్రయాణికుల మధ్య నక్కారని చెబుతున్నారు. మహిళలు, చిన్నారులను మానవ కవచాలుగా వాడుకున్నట్టు మీడియా పేర్కొంది. 50 మంది వేర్పాటువాదులను హతమార్చి 190 మంది ప్రయాణికులను కాపాడినట్టు పాక్‌ సర్కారు కూడా బుధవారం సాయంత్రం పేర్కొంది. ఇందుకు ప్రతీకారంగా 50 మందికి పైగా బందీలను చంపేసినట్టు బీఎల్‌ఏ ప్రకటించింది. ‘ఇప్పటిదాకా 100 మందికి పైగా బందీలను కాల్చేశాం. ఇంకో 150 మంది బందీలుగానే ఉన్నారు. డెడ్‌లైన్లో కొన్ని గంటల్లో ముగియనుంది. ఆలోపు మా నేతలందరినీ వదిలేయకుంటే గంటకు కొందరు చొప్పున బందీలను చంపేస్తాం’ అని ఒక ప్రకటనలో హెచ్చరించింది.

ప్రత్యక్ష నరకమే..
హైజాక్‌ నుంచి క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు తాము అనుభవించిన నరకాన్ని తలచుకుంటూ ఇప్పటికీ వణికిపోతున్నారు. వేర్పాటువాదుల చెరనుంచి బయటపడ్డాక వారంతా రాత్రిపూట వణికించే చలిలో 4 గంటల పాటు నడిచి సమీపంలోని రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వృద్ధులు, పిల్లలు, రోగులను మిగతావారు భుజాలపై మోసుకెళ్లారు. సెలవుపై ఇళ్లకు వెళ్తున్న సైనికులను తమ కళ్లముందే కాల్చి పొట్టన పెట్టుకున్నారని హమీద్‌ అనే ప్రయాణికుడు బీబీసీకి వెల్లడించాడు. ‘బోగీల్లోకి చొరబడటంతోనే ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్‌ చేశారు. పిల్లలు, మహిళలు, పౌరులను వేరు చేశారు. సైనికులందరినీ మరోవైపు తరలించారు. ఆ క్రమంలో ముగ్గురు సైనికులను మేం చూస్తుండగానే కాల్చేసి బిగ్గరగా నినాదాలు చేశారు. నేను హృద్రోగినని వేడుకోవడంతో వదిలేశారు’ అని చెప్పాడు. ‘భారీ బాంబు పేలుళ్లు, కాల్పుల మోతలను జీవితంలో మర్చిపోలేను. ఏం జరుగుతుందోనని 50 నిమిషాలకు పైగా ఊపిరి బిగబట్టుకుని గడిపాం’ ఇషాక్‌ నూర్‌ చెప్పుకొచ్చాడు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)