Breaking News

‘25 వేల మరణాలను అడ్డుకున్నా’: ట్రంప్‌ సంచలన ప్రకటన

Published on Sun, 10/19/2025 - 08:51

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు సంచలన ప్రకటన చేశారు. ఇటీవల కరేబియన్‌లో అమెరికా జరిపిన సైనిక దాడిలో ఒక భారీ మాదకద్రవ్యాల జలాంతర్గామి ధ్వంసమైందని, ఈ దాడిలో ఇద్దరు నార్కో ఉగ్రవాదులను హతం చేశామని, మరో ఇద్దరిని సజీవంగా పట్టుకున్నామని తెలిపారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా  ఆయన షేర్‌ చేశారు. అధ్యక్షుడు ట్రంప్‌ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో.. ‘ఆ జలాంతర్గామిలో అధికంగా ఫెంటానిల్  తదితర మాదకద్రవ్యాలు ఉన్నాయని, అది నార్కోట్రాఫికింగ్ ట్రాన్సిట్ రూట్ ద్వారా అమెరికా వైపు వస్తున్నదని, దానిని అడ్డగించడం ద్వారా 25 వేల అమెరికన్ల మరణాలను నిరోధించగలిగానని’ ట్రంప్‌ పేర్కొన్నారు.

తన సోషల్‌ మీడియా పోస్టులో ట్రంప్..‌ ‘ఒక భారీ మాదకద్రవ్యాల జలాంతర్గామిని నాశనం చేయడమనేది నాకు లభించిన గొప్ప గౌరవం. ఓడలో అధికంగా ఫెంటానిల్ ఉందని యూఎస్‌ ఇంటెలిజెన్స్ నిర్ధారించింది. ఆ జలాంతర్గామిలో నలుగురు  నార్కోటెర్రరిస్టులు ఉన్నారు. వారిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సజీవంగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను వారి స్వదేశాలైన ఈక్వెడార్, కొలంబియాకు విచారణ కోసం తిరిగి పంపుతున్నారు’ అని పేర్కొన్నారు.

ఈ దాడి తర్వాత అమెరికా నావికాదళం ఇద్దరు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకుందని, వారిని ఒక అమెరికన్ యుద్ధనౌకలో ఉంచిందని ఫాక్స్ న్యూస్  ధృవీకరించింది. కాగా గత నెలలో కరేబియన్‌లో  యుద్ధ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి అమెరికా అనుమానిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా నౌకలను అడ్డగించడం ఇది ఆరోసారి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు  గట్టి దెబ్బ తగిలిందని చెబుతున్న అమెరికా అధికారులు.. ఈ దాడుల్లో హతమైన 27 మంది  మాదకద్రవ్యాల స్మగ్లర్లే అని ధృవీకరించే ఎటువంటి ఆధారాలను మీడియాకు అందించలేదు. ఈ రీతిలో అంతమొందించడం చట్టవిరుద్ధమని నిపుణులు  వాదిస్తున్నారు. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)