Breaking News

జాగ్రత్త.. 25 కోట్ల తేనెటీగలు తప్పించుకున్నాయి

Published on Sun, 06/01/2025 - 06:30

వాషింగ్టన్‌: మల్లాది ‘నత్తలొస్తున్నాయ్‌ జాగ్రత్త’ నవల గుర్తుందా? కెన్యా నుంచి వచ్చిన భయంకరమైన రాక్షస నత్తలు ఓ రైలు ప్రమాదంలో తప్పించుకుని ఆంధ్ర రాష్ట్రంపై పడతాయి. చూస్తుండగానే అసంఖ్యాకంగా పెరిగిపోయి అల్లకల్లోలం చేసిపారేస్తాయి. అదీ, ఇదీ అని తేడా లేకుండా దొరికిన దాన్నల్లా తినేస్తూ భయోత్పాతం సృష్టిస్తాయి. అమెరికాలో వాషింగ్టన్‌ రాష్ట్రంలో కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 25 కోట్ల తేనెటీగలు తప్పించుకున్నాయి! 

31,751 కిలోల తేనెతుట్టెలతో వెళ్తున్న వాహనం లిండెన్‌ సమీపంలో కెనడా సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ మూలమలుపు వద్ద వేగాన్ని డ్రైవర్‌ నియంత్రించలేకపోవడంతో బోల్తా పడింది. తేనెతుట్టెలన్నీ చెల్లాచెదురుగా పడిపోవడంతో తేనెటీగలు బయటికొచ్చి జారుకున్నాయి. విషయం తెలియగానే పోలీసులు తేనెటీగల నిపుణులతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి తేనెతుట్టెలను ఒక్కచోటికి చేర్చారు. తప్పించుకున్న తేనెటీగల కోసం ఎదురుచూస్తూ గడుపుతున్నారు. అవి తప్పకుండా తుట్టెల వద్దకు తిరిగొస్తాయని నిపుణులు చెప్పారు. 

‘‘తేనెటీగలు రాణి ఈగను విడిచి ఉండలేవు. దాన్ని తీసుకొని రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాయి’’ అని వివరించారు. కనుక రెండు మూడు రోజులపాటు పరిసర ప్రాంతాలకు రావొద్దని స్థానికులకు పోలీసులు సూచించారు. అమెరికాలో లక్షలాది తేనెటీగలను తరచుగా ఇలా ఒకచోటి నుంచి మరోచోటికి తరలిస్తుంటారు. వ్యవసాయంలో తేనెటీగలది కీలక పాత్ర. పరాగ సంపర్కానికి, పంటలు పండడానికి దోహదపడతాయి. ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య భారీగా తగ్గిపోతుండటంతో మే 20ని ‘ప్రపంచ తేనెటీగల దినం’గా జరుపుకోవాలని ఐరాస 2018లో పిలుపునిచ్చింది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)