Breaking News

ట్రక్కు డ్రైవర్‌కు క్షమాభిక్ష పెట్టాలని 15 లక్షల సంతకాలు 

Published on Mon, 08/25/2025 - 06:11

ఫ్లోరిడా: అమెరికాలో ముగ్గురు మృతికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ హర్జిందర్‌ సింగ్‌ కేసు వివాదాస్పదమవుతోంది. అతనికి క్షమాభిక్ష కోసం వేసిన ఆన్‌లైన్‌ పిటిషన్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. హర్జిందర్‌ సింగ్‌కు మద్దతుగా 15 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. అయితే.. హత్యానేరం ఎదుర్కొంటున్న వ్యక్తికి క్షమాభిక్ష కోరడంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ఇమిగ్రేషన్‌ సంబంధింత విధానాలపై చర్చకు దారి తీసింది.  

ఫ్లోరిడాలోని ఫోర్ట్‌ పియర్స్‌లో భారతీయ డ్రైవర్‌ 28 ఏళ్ల హర్జిందర్‌ సింగ్‌ తప్పుడు యూ–టర్న్‌ తీసుకోవడంతో అతను నడుపుతున్న ట్రక్కు.. మినీ వ్యాన్‌ను ఢీకొంది. దీంతో అందులో ఉన్న ముగ్గురు మరణించారు. ఆగస్టు 12న ఈ ప్రమాదం జరిగింది. సింగ్‌ 2018లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి కాలిఫోరి్నయాలో వాణిజ్య డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాడని ఆరోపణలున్నాయి.

 అయితే ఈ ప్రమాదం కేసులో గతవారం అతన్ని కాలిఫోరి్నయాలోని స్టాక్‌టన్‌లో అరెస్టు చేసి ఫ్లోరిడాకు తిరిగి అప్పగించారు. ఈ ప్రమాదం తరువాత పత్రాలు లేని వలసదారుల వల్ల ప్రమాదాల గురించి ఆందోళన తలెత్తింది. వాణిజ్య ట్రక్‌ డ్రైవర్లకు వర్కర్‌ వీసాలు జారీకి అమెరికా ప్రభుత్వం తాత్కాలిక విరామం ప్రకటించింది. అయితే.. హర్జిందర్‌ సింగ్‌ను విడుదల చేయాలంటూ ఆన్‌లైన్‌లో పిటిషన్‌ వేశారు. అది ఒక విషాదకరమైన ప్రమాదమని, ఉద్దేశపూర్వకమైన చర్యకాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

దీంతో ఆ పిటిషన్‌కు ఎక్కడలేని ఆదరణ లభించింది. ఆయనకు క్షమాభిక్ష పెట్టాలంటూ 15లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. దీనిపై స్థానికంగా వ్యతిరకేత వస్తోంది. ముగ్గురు అమెరికన్‌ పౌరుల మరణానికి కారణమైన వ్యక్తిని విడుదల చేయాలని కోరుకుంటున్నవారి ఇమ్మిగ్రేషన్‌ స్థితిని తనిఖీ చేయాలంటూ డిమాండ్‌ మొదలైంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి తెల్లవాడైతే, చనిపోయినవారు భారతీయులైతే వారు ఇలాంటి పిటిషన్‌పై సంతకం చేయరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురిని హత్య చేసిన వ్యక్తికి శిక్ష పడకూడదని కోరుకోవడం హాస్యాస్పదమంటున్నారు. అతనికి మద్దతు ఇస్తున్నవారిని బహిష్కరించాలని కోరుతూ మరో పిటిషన్‌ ప్రారంభించారు. అమెరికా ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోదని, దానిని సమరి్ధంచే వారికి ఆశ్రయం ఇవ్వబోదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)