మన డ్రైవింగ్‌ లైసెన్స్‌తోనే విదేశాల్లో డ్రైవ్‌ చేయవచ్చు

Published on Wed, 03/04/2026 - 22:30

ఇండియాలో ఉన్నప్పుడు సరే... కానీ కుటుంబ సభ్యులతో కలిసి కారు నడుపుతూ విదేశాల్లో తిరగడం అంటే ఆ అనుభూతి వేరే లెవెల్‌... ఆ అనుభూతి మన స్వంతం కావాలన్నా, విదేశాల్లో వ్యక్తిగత వాహనం నడపాలన్నా... మళ్లీ అక్కడ  లైసెన్స్‌ తీసుకోక తప్పదు.. ఈ ఆలోచనతోనే చాలా మంది విదేశాల్లో ఉన్నప్పుడు తమకు  డ్రైవింగ్‌ వచ్చిన సంగతి మర్చిపోతారు. అయితే భారతీయులు భారతీయ లైసెన్స్ తోనే డ్రైవ్‌ చేయడానికి అనుమతించే 21 దేశాలు ఉన్నాయి తెలుసా?

ఆస్ట్రేలియా: నార్తర్న్‌ టెరిటరీ, న్యూ సౌత్‌ వేల్స్, విక్టోరియా మినహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలలో డ్రైవ్‌ చేయడానికి ఆస్ట్రేలియా మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇక్కడ ఎడమచేతి డ్రైవింగ్‌ ఓకే.

భూటాన్‌: భారతీయ లైసెన్స్ పొందిన డ్రైవర్లు తమ స్వంత వాహనాలతో ఒక సంవత్సరం వరకు భూటాన్‌ లో డ్రైవ్‌ చేయడానికి అనుమతిస్తారు. అయితే మన కరెన్సీలో రూ.4490 చెల్లింపుతో పాటు. వాహన పత్రాలు  వారి చెక్‌ పోస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో రిజిస్ట్రేషన్‌ వంటి అన్ని అవసరమైన నిబంధనలను పాటించాలి, ప్రమాదకరమైన పర్వత రోడ్ల కారణంగా భూటాన్ లో స్థానిక గైడ్‌ లేదా లైసెన్స్ పొందిన డ్రైవర్‌ లేకుండా భూటాన్ లో కారు అద్దెకు తీసుకోవడం నిషేధం అనే విషయం గమనించడం ముఖ్యం. ఎడమ చేతివైపే డ్రైవ్‌.

కెనడా: ఈ దేశంలో మన లైసెన్స్‌ను డ్రైవింగ్‌ చేయడానికి అనుమతిస్తుంది కానీ ఇది అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉండే  కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు, ఒంటారియోలో బస మూడు నెలల కన్నా తక్కువ ఉంటే, స్వంత లైసెన్స్ తప్ప మరే ఇతర పత్రాలు అవసరం లేదు. అయితే, అంతకన్నా ఎక్కువగా ఉంటే, అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ కూడా అవసరం. ఈ దేశంలో కుడి చేతివైపు డ్రైవ్‌ చేయాల్సి ఉంటుంది.

ఫ్రాన్స్, మొనాకో: ఫ్రాన్స్ , మొనాకోలు  భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్ పై  లేదా అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌తో ఆరు నెలల వరకు డ్రైవ్‌ చేయడానికి అనుమతిస్తాయి. ఇక్కడ కుడి చేతి డ్రైవ్‌ ఉంటుంది.

ఫిన్లాండ్‌: భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ఫిన్లాండ్‌ ఒక సంవత్సరం వరకు డ్రైవింగ్‌ చేయడానికి అనుమతిస్తుంది. ఇక్కడ కూడా కుడి చేతి డ్రైవ్‌  చేయాలి.

జర్మనీ: జర్మనీలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆరు నెలల వరకు మన లైసెన్స్‌తో డ్రైవ్‌ చేయడానికి అనుమతిస్తారు. ఇక్కడా కుడి చేతి డ్రైవ్‌.

హాంకాంగ్‌: భారతీయ లైసెన్స్ పై  డ్రైవ్‌ చేయడానికి 12 నెలల వరకు అనుమతిస్తుంది. ఇక్కడ ఎడమ చేతి డ్రైవ్‌ ఉంటుంది.

ఐస్లాండ్‌: ఐస్లాండ్‌ మన లైసెన్స్ పై ఒక సంవత్సరం వరకు డ్రైవింగ్‌ చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఇక్కడ కుడి చేతి డ్రైవ్‌ చేయాలి.

ఇటలీ: భారతీయ లైసెన్స్ పై రెండు సంవత్సరాల వరకు డ్రైవ్‌ చేయడానికి ఇటలీలో,  అనుమతి ఉంది, దానితో పాటు అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ కూడా ఇక్కడ పనికొస్తుంది. ఇక్కడ  కుడి చేతి డ్రైవ్‌ ఉంటుంది.

మలేషియా: ఇటీవలి కాలంలో మన దేశ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటున్న మలేషియా భారతీయ లైసెన్స్ పై మూడు నెలల వరకు డ్రైవ్‌ చేయడానికి అనుమతిస్తుంది.  ఇక్కడ ఎడమ చేతి డ్రైవ్‌ చేయాల్సి ఉంటుంది.

నేపాల్‌: భారతీయ లైసెన్స్ పొందిన డ్రైవర్లు దేశంలో డ్రైవింగ్‌ చేయవచ్చు.  గరిష్టంగా ఒక నెల వరకు అందుబాటులో ఉండే పర్మిట్‌ను పొందడం ద్వారా స్వంత వాహనాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎడమ చేతి డ్రైవ్‌..

న్యూజిలాండ్‌: భారతీయ లైసెన్స్ పై  న్యూజిలాండ్‌లో 18 నెలలు డ్రైవ్‌ చేయవచ్చు. అయితే ఇక్కడ ఎల్లప్పుడూ లైసెన్స్ అనువాద కాపీ లేదా అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ కలిగి ఉండాలి. ఇక్కడ ఎడమ చేతి డ్రైవ్‌ ఉంటుంది.

నార్వే: నార్వే దేశంలో డ్రైవ్‌ చేయడానికి,  ఇక్కడి డ్రైవింగ్‌ లైసెన్స్ పై  మూడు నెలల వరకు డ్రైవ్‌ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో,  అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ అవసరం కావచ్చు. ఇక్కడ కుడివైపు డ్రైవ్‌ చేయాలి.

సౌదీ అరేబియా: మన డ్రైవింగ్‌ లైసెన్స్ తో ఒక సంవత్సరం వరకు డ్రైవింగ్‌ చేయడానికి సౌదీ అరేబియా అనుమతిస్తుంది. అయితే, అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ కూడా కలిగి ఉండటం మంచిది. ఇక్కడ కుడివైపు డ్రైవ్‌...

సింగపూర్‌: 12 నెలల వరకు సింగపూర్‌ లో తిరగడానికి, అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ లేదా మన లైసెన్స్‌ కొన్ని చట్టపరమైన నిబంధనలతో  చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ ఎడమవైపు డ్రైవ్‌ ఉంటుంది.

స్పెయిన్‌: చట్టపరమైన అనువాద పత్రం లేదా అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ చూపిస్తే స్పెయిన్‌ విదేశీ లైసెన్స్ పై ఆరు నెలల వరకు డ్రైవింగ్‌ చేయడానికి అనుమతిస్తుంది. ఈ దేశంలో కుడివైపు డ్రైవ్‌ ఉంటుంది.

స్వీడన్‌: ఈ దేశంలో..కారు అద్దెకు తీసుకోవడానికి నడపడానికి, ఆంగ్లంలో అనువదించిన డ్రైవింగ్‌ లైసెన్స్ (Driving Licence) ఉండాలి. విదేశీ లైసెన్స్ డ్రైవింగ్‌ చేయడానికి గరిష్టంగా ఒక సంవత్సరం వరకు అనుమతి ఉంది. ఇక్కడ కుడివైపు డ్రైవ్‌ చేయాలి.

స్విట్జర్లాండ్‌: భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్ తో స్విట్జర్లాండ్‌ లో ఒక సంవత్సరం వరకు డ్రైవ్‌ చేయవచ్చు. ఆంగ్లంలోని డ్రైవింగ్‌ లైసెన్స్ కాపీతో  ఈ దేశంలో వాహనాన్ని లీజుకు తీసుకోవచ్చు. కుడివైపు డ్రైవ్‌ ఉంటుంది.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌: ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌ వేల్స్‌తో సహా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మనల్ని 12 నెలల వరకు డ్రైవ్‌ చేయడానికి అనుమతిస్తుంది. అయితే, భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్ లో పేర్కొన్న వాహనాలని మాత్రమే నడపగలరని గమనించడం ముఖ్యం. ఇక్కడ ఎడమవైపు డ్రైవ్‌ చేయాలి.

అమెరికా: యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా భారతీయ లైసెన్స్ లో ఉన్న అదే  రకం కార్లను ఒక సంవత్సరం వరకు అద్దెకు తీసుకుని నడపడానికి అనుమతిస్తుంది.  ఇక్కడ కుడివైపు డ్రైవ్‌ ఉంటుంది.

యుఎఇ: ఇక్కడ డ్రైవింగ్‌ చేయడానికి పర్యాటకులు భారతీయ లైసెన్స్‌ను ఉపయోగించడానికి అనుమతిస్తుంది.  ఇక్కడ కుడివైపు డ్రైవ్‌ ఉంటుంది. అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ (Driving Permit) అవసరం.. భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్ తో డ్రైవ్‌ చేయడానికి మనల్ని అనుమతించే దేశంలో కూడా, అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ను దగ్గర ఉంచుకోవడం ఎల్లప్పుడూ మంచిది. ఇది పొందడానికి ప్రొసీజర్‌ ప్రకారం దరఖాస్తు చేసుకుంటే పర్మిట్‌ ప్రాసెస్‌ చేయడానికి దాదాపు ఒక వారం పడుతుంది. ఇది జారీ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)