Breaking News

Singapore: వేశ్యలపై దాడి.. ఇద్దరు భారతీయులకు జైలు

Published on Sat, 10/04/2025 - 09:52

సింగపూర్: సింగపూర్‌లో ఇద్దరు సెక్స్ వర్కర్లను దోచుకుని, వారిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతదేశానికి చెందిన ఇద్దరు యువకులకు సింగపూర్‌ కోర్టు ఐదేళ్ల ఒక జైలుతో పాటు 12 బెత్తం దెబ్బలను శిక్షగా విధించింది. ఆరోక్కియసామి డైసన్(23) రాజేంద్రన్ మైలరసన్(27)లు కోర్టు ముందు  నేరాన్ని అంగీకరించారని ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్’ తన కథనంలో తెలిపింది.

ఆరోక్కియసామి, రాజేంద్రన్ ఏప్రిల్ 24న భారత్‌ నుండి సింగపూర్‌కు వచ్చారు. రెండు రోజుల తర్వాత వీరు లిటిల్ ఇండియా ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా, ఒక గుర్తు తెలియని వ్యక్తి వారితో ‘లైంగిక సేవల కోసం వేశ్యలు కావాలా? అని అడుగుతూ, ఇద్దరు మహిళల సమాచారాన్ని అందించాడు. అయితే ఆరోక్కియ తన స్నేహితుడు రాజేంద్రన్‌తో..మనకు డబ్బు చాలా అవసరమని, ఆ మహిళలను హోటల్ గదిలో దోచుకోవాలని సూచించాడు. దీనికి రాజేంద్రన్ అంగీకరించాడు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఒక హోటల్ గదిలో ఒక మహిళను కలవడానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారు.

వారిద్దరూ గదిలోకి వెళ్లి, ఆ మహిళ చేతులు, కాళ్లను కట్టేసి దాడి చేశారు. ఆమె దగ్గరున్న నగలు, నగదు, పాస్‌పోర్ట్, బ్యాంక్ కార్డులను దోచుకున్నారు. తరువాత అదే రోజు రాత్రి 11 గంటలకు వారిద్దరూ మరొక హోటల్‌లో  ఇంకో మహిళను కలుసుకున్నారు. ఆమె కేకలు వేయకుండా ఉండేందుకు రాజేంద్రన్ ఆమె నోటిని మూశాడు. తరువాత ఆమె దగ్గరున్న నగదు, రెండు మొబైల్ ఫోన్లు, ఆమె పాస్‌పోర్ట్‌ను దొంగిలించారు. తాము తిరిగి వచ్చే వరకు గది నుండి బయటకు వెళ్లవద్దని ఆమెను హెచ్చరించారు. కాగా బాధిత మహిళల ఫిర్యాదుతో విషయం కోర్టు వరకూ చేరింది.

ఈ ఘటనపై జడ్జి తీర్పునిస్తున్న సమయంలో నిందితులు ఆరోక్కియసామి, రాజేంద్రన్ తేలికైన శిక్ష కోసం వేడుకున్నారు.‘మా నాన్న గత  ఏడాది మరణించారు. నాకు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. వారిలో ఒకరికి వివాహం అయింది. మా దగ్గర డబ్బు లేదు. అందుకే మేము ఇలా చేశాం’ అని ఒక అనువాదకుని సాయంతో ఆరోక్కియసామి జడ్జి ముందు పేర్కొన్నాడు. ‘నా భార్య, బిడ్డ భారతదేశంలో ఒంటరిగా ఉన్నారు. వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు’ అని రాజేంద్రన్ జడ్జి ముందు మొరపెట్టుకున్నాడు. కాగా దోపిడీకి పాల్పడి, గాయపరిచిన నేరానికి ఐదు నుండి 20 ఏళ్ల జైలు శిక్ష,కనీసం 12 బెత్తం దెబ్బలు విధించే అవకాశాలుంటాయని  సింగపూర్ దినపత్రిక ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్’ పేర్కొంది.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)