అమెరికాలో మళ్లీ కాల్పులు 

Published on Mon, 12/15/2025 - 05:21

ప్రొవిడెన్స్‌: అమెరికాలో మళ్లీ తుపాకీ గర్జించింది. రోడ్‌ ఐలాండ్స్‌లోని ప్రొవిడెన్స్‌ పట్టణంలోని బ్రౌన్‌ యూనివర్సిటీలో కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడు కాలేజ్‌కు వచ్చి పరీక్షలు రాస్తున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దాంతో ఇద్దరు మరణించారు. 9 మంది గాయపడ్డారు. వెంటనే దుండగుడు పరారయ్యాడు.

 అతను 30ల్లో ఉంటాడని, నలుపు దుస్తులు ధరించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఎప్పుడు, ఎక్కడ అతడు దొరికాడన్న విషయం పోలీసులు వెల్లడించలేదు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల శబ్దం వినగానే విద్యార్థులంతా హడలిపోయారు.

 రూమ్‌లో, బాత్రూమ్‌లలో, డెస్క్‌ కింద, జిమ్‌లో, ఎక్కడ వీలైతే అక్కడే గంటల తరబడి దాక్కున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. దాంతో వారాంతంలో అత్యంత సందడిగా ఉండే పట్టణ వీధులన్నీ దుండగుడు బయటే తిరుగుతున్నాడన్న భయంతో నిర్మానుష్యంగా మారిపోయాయి. సెక్యూరిటీ చెకింగ్‌లను దాటుకుంటూ అతను కాలేజీలోకి హంతకుడు ఎలా రాగలిగాడు? ఫేస్‌ రికగి్నషన్‌ లాక్‌ రక్షణ ఉన్న క్లాస్‌ రూమ్‌ లోనికి ఎలా దూరాడు అన్నది ప్రశ్నగా మారింది. మృతులకు అమెరికా ట్రంప్‌ నివాళులు అర్పించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దుండగుడు హ్యాండ్‌ గన్‌ వాడినట్టు భావిస్తున్నారు.
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)