Breaking News

కాషాయ జెండా ఎగరేసినందుకు.. బంగ్లాదేశ్‌లో 18 మందిపై దేశ ద్రోహం కేసు

Published on Sat, 11/02/2024 - 05:11

ఢాకా: మైనారిటీ హిందువులే లక్ష్యంగా బంగ్లాదేశ్‌ యంత్రాంగం వ్యవహరిస్తున్నదనేందుకు తాజా ఉదాహరణ. మైనారిటీలకు రక్షణ కల్పించేందుకు చట్టాలు తేవాలంటూ ఇటీవల చత్తోగ్రామ్‌లో హిందువులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాషాయ జెండా ఎగురవేశారు. దీనిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో 18 మందిపై దేశ ద్రోహ చట్టం కింద కేసు నమోదైంది. మరో 20 మంది వరకు గుర్తు తెలియని వ్యక్తులపైనా అక్టోబర్‌ 25న కేసు నమోదు చేశారు. 

తమ 8 డిమాండ్ల అజెండాకు బంగ్లాదేశ్‌లోని అవామీ లీగ్, భారత ప్రభుత్వం సాయంగా నిలిచాయని పుండరీక్‌ ధామ్‌ ప్రెసిడెంట్, కేసు బాధితుడు అయిన చిన్మయ్‌ కృష్ణ దాస్‌ బ్రహ్మచారి తెలిపారు. తమ నిరసన బంగ్లా ప్రభుత్వానికి వ్యతిరేకం కానే కాద న్నారు. కాగా, ఈ చర్యను అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం ఎన్నికల ప్రచారంలో ఖండించడం గమనార్హం. ఇలా ఉండగా, హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఉంటేనే తప్ప, పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి దేశ ద్రోహం కేసును తనంత తానే నమోదు చేయలేరని పరిశీలకులు అంటున్నారు. నేరం రుజువైతే జీవిత కాల జైలు శిక్ష పడవచ్చు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)