Breaking News

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌: 16 మంది భారతీయులు మిస్సింగ్‌, 12 మంది మృతి

Published on Fri, 01/17/2025 - 20:36

ఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్దంలో రష్యా  తరఫున పోరాడుతున్న 16 మంది భారతీయులు కనిపించకుండా పోవడంతో పాటు, ఇప్పటి వరకు 12 మంది మరణించినట్లు కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. ప్రస్తుతం రష్యాలో చిక్కుకుని యుద్ధంలో పోరాడుతున్న భారతీయ పౌరులందరినీ స్వదేశానికి రప్పించడం కోసం తాము రష్యన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.

రష్యా తరఫున యుద్ధంలో 126 మంది భారతీయులు పాల్గొన్నట్లు సమాచారం ఉందన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ.. 96 మంది సైన్యం నుంచి విడుదలయ్యారని పేర్కొంది. కొందరు స్వదేశానికి తిరిగివచ్చారని.. ఇక 18 మంది ఇంకా సైన్యంలోనే పనిచేస్తున్నారని జైశ్వాల్ తెలిపారు. వారిలో 16 మంది ఆచూకీ లేదని స్పష్టం చేశారు.

తాజాగా రష్యా తరఫున యుద్దంలో పాల్గొన్న భారతీయుడు మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారతీయుడి మృతిని దేశ విదేశాంగశాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో, రష్యా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. 

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో రష్యాకు మద్దతుగా యుద్ధం చేస్తున్న కేరళకు చెందిన బినిల్‌ బాబు(32) మృతిచెందాడు. అలాగే, అతడి సమీప బంధువు టీకే జైన్‌ (27)కు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో బినిల్‌ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతడి బంధువులు మీడియాతో చెప్పారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో భారతీయుడి మృతిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.

ఇదీ చదవండి: ద.కొరియా విమాన ప్రమాదం..వెలుగులోకి కీలక విషయాలు

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)