Breaking News

బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు కొత్త టెన్షన్‌!

Published on Sun, 09/15/2024 - 21:20

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఉచ్చు బిగుస్తోంది. షేక్‌ హసీనాను తమ దేశం రప్పించేందుకు తాత్కాలిక ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. ఆమె వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం విశేషం. తాజాగా షేక్‌ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 155కి చేరింది.

కాగా, బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనల కారణంగా షేక్‌ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఇప్పట్లో ఆమె బంగ్లాదేశ్‌కు వెళ్లే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఆమెను తిరిగి బంగ్లాకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు తాత్కాలిక ప్రభుత్వం సైతం ఇదే పనిలో బిజీగా ఉంది. అయితే, హింసాత్మక ఘటనల్లో 22 ఏళ్ల విద్యార్థి హత్యకు సంబంధించి హసీనాతోపాటు మరో 58 మందిపై హత్య కేసు నమోదైనట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఇక, హసీనాపై ఇప్పటివరకు 155 కేసులు నమోదయ్యాయి. ఇందులో హత్య కేసులే 136 ఉన్నాయి. మారణహోమం, ఇతర నేరాలకు సంబంధించి ఏడు, మూడు అపహరణ, ఎనిమిది హత్యాయత్నంతోపాటు బీఎన్‌పీ పార్టీ ఊరేగింపుపై దాడికి సంబంధించిన కేసులున్నాయి. దీంతో, నేరాలు, కేసుల విషయంలో ఆమె బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు.. ఈ క్రమంలో భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్‌ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పిస్తామని, ఆమెపై అరెస్టు వారెంట్లు జారీ చేస్తామని ఐసీటీ నూతన ప్రాసిక్యూటర్‌ కామెంట్స్‌ కూడా చేశాడు.

ఇది కూడా చదవండి: పాక్‌ మాజీ పీఎం ఇమ్రాన్‌ ఖాన్‌పై మరో కేసు

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)