Breaking News

సిడ్నీలో దారుణం.. షార్క్ దాడిలో 12 ఏళ్ల బాలుడు మృతి

Published on Sun, 01/25/2026 - 01:18

ఆస్ట్రేలియాలోని సిడ్నీ న‌గ‌రంలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. షార్క్ దాడిలో నికో ఆంటిక్ అనే 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గత ఆదివారం నికో తన స్నేహితులతో కలిసి సిడ్నీలోని వాక్లూస్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ రాళ్లపై నీటిలోకి దూకుతూ సరదాగా ఆడుతుండగా.. అకస్మాత్తుగా ఒక షార్క్ అతడిపై దాడి చేసింది. 

వెంటనే ఆ పిల్లాడిని నీటిలో నుంచి బయటకు తీసి ఆస్ప‌త్రికి తరలించారు. అయితే ఈ దాడిలో  నికో రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో నికో ఆంటిక్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ శ‌నివారం మరణించాడు. ఈ విషయాన్ని బాలుడి కుటంబ సభ్యులు ధ్రువీకరించారు.

"మా కుమారుడు నికో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా ఉత్సాహంగా ఉండేవాడు. స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అతడు మాతో గడిపిన క్షణాలను మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం" అని నికో తల్లిదండ్రులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గత రెండు రోజుల్లో నాలుగు షార్క్ దాడులు జరగడంతో సిడ్నీ సహా పలు తీరప్రాంతాల్లో చాలా వరకు బీచ్‌లను అధికారులు మూసివేశారు. భారీ వర్షాల వల్ల సముద్రపు నీరు  మురికిగా మారడం వల్ల షార్క్‌లు తీరానికి ఎక్కువగా వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)