Breaking News

థాయ్‌లో ఫెర్రీ ప్రమాదం..100 మంది సురక్షితం

Published on Fri, 11/21/2025 - 06:32

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతం నుంచి ట్రాట్‌ ప్రావిన్స్‌లోని ప్రధాన భూభాగం వైపు వస్తున్న ఫెర్రీ ప్రమాదంలో చిక్కుకుంది. సకాలంలో స్పందించిన అధికార యంత్రాంగం సిబ్బంది సహా మొత్తం 100 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో, పెనుప్రమాదం తప్పినట్లయిందని అధికారులు తెలిపారు. ప్రైవేట్‌ సంస్థకు చెందిన ఫెర్రీ గురువారం పర్యాటక ప్రాంతమైన కోహ్‌ కూద్‌ నుంచి ట్రాట్‌ నగరం వైపు బయలుదేరింది. 

దాదాపు 40 కిలోమీటర్ల దూరానికి గాను మధ్యలోకి వచ్చేసరికి ఫెర్రీకి రంధ్రం పడి లోపలికి నీరు చేరడం మొదలైంది. సముద్రంలో భారీ అలలు ఎగసి పడుతుండటంతో అప్రమత్తమైన సిబ్బంది ఫెర్రీకి లంగరేసి అధికారులకు ప్రమాద సందేశాన్ని పంపించారు. సమాచారమందుకున్న ఇతర ఫెర్రీల నిర్వాహకులు, సమీప బోట్లలోని మత్స్యకారులతోపాటు నేవీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గంట వ్యవధిలోనే ఫెర్రీలో ఉన్న 97 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం ఫెర్రీలోని నీటిని తోడివేసి, తీరానికి తీసుకెళ్లారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)