Breaking News

అల్వాల్‌లో రియల్టర్ తిరుపతిరెడ్డి కిడ్నాప్‌.. రూ.700కు ఆటో మాట్లాడుకుని..

Published on Fri, 07/14/2023 - 12:31

హైదరాబాద్‌: అల్వాల్ రియల్టర్ తిరుపతిరెడ్డి కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట భూ వివాదాలే కిడ్నాప్‌కు కారణమని భావించిన పోలీసులు.. తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద దిగిన తిరుపతి రెడ్డి ఐదు నిమిషాల్లోనే ఒక ఆటోలో సొంతంగా ఎక్కి వెళ్లినట్లు గుర్తించారు.

రూ.700కు ఆటో మాట్లాడుకుని ఘట్‌కేసర్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఆధారంగా గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లారనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. నాలుగు టీంలుగా ఏర్పడి ఎస్వోటి, అల్వాల్ పోలీసులు తిరుపతిరెడ్డి కోసం వెతుకుతున్నారు. 

తిరుపతి రెడ్డికి చెందిన 3 ఎకరాల భూమిని మామిడి జనార్దన్ రెడ్డి కబ్జాకు ప్రయత్నిస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మామిడి జనార్దన్ రెడ్డిపై మూడు కమిషనరేట్ల పరిధిలో 15 కుపైగా భూకబ్జా కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. తిరుపతి రెడ్డి కిడ్నాప్ పై ఇంకా ఆచూకి లభించలేదని తెలిపారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 

ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అండతోనే మామిడి జనార్థన్ రెడ్డి అల్వాల్ లో పలు భూ కబ్జాలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపించారు. తిరుపతి రెడ్డి కి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే మైనంపల్లి, జనార్దన్ రెడ్డి బాధ్యులు అంటూ బాధితుని భార్య ఆవేదన వ్యక్తం చేశారు. కుషాయిగూడలోని నివసించే తిరుపతిరెడ్డికి పాకాల కుంటలోని స్థలంపై కొన్ని నెలల క్రితం వివాదం జరిగింది. ఈ వ్యవహారంలోనే దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. 
ఇదీ చదవండి: షిర్డీ రైలులో చోరి.. లేడీ దొంగలను వదిలేసిన పోలీసులు.. అసలేం జరిగింది!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)