Breaking News

హైదరాబాద్‌లో దారుణం..కారులో యువతిపై గ్యాంగ్‌ రేప్‌

Published on Wed, 07/03/2024 - 19:08

సాక్షి,హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో దారుణం జరిగింది. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై సామూహిక హత్యాచారం జరిగింది.ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని అరెస్ట్‌ చేసిన జైలుకు తరలించినట్లు పోలీసులు అధికారిక ప‍్రకటన చేశారు. 

జేఎస్‌ఆర్‌ గ్రూప్‌ సన్‌సిటీ అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో బాధితురాలు ట్రైనీగా చేరింది. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సంగారెడ్డి, జనార్దన్‌రెడ్డి బాధితురాలితో కలిసి సైట్‌ విజిట్‌ నిమిత్తం యాదాద్రికి కారులో వెళ్లారు. అక్కడ సైట్‌ విజిట్‌ చేసి తిరిగి వస్తుండగా నిందితులు ఆమెకు ముందుగా మత్తు మందు కలిపిన ఆహార పదార్ధాలు తినేలా ప్లాన్‌ చేశారు. ఆమె తినకపోవడంతో  మత్తుమందు కలిపిన కూల్‌డ్రింగ్‌ ఇచ్చారు. ఆ కూల్‌డ్రింక్‌ తాగిన ఆమెపై కారులోనే దారుణానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెకు స్ప్రహ రావడంతో హస్టల్‌ దగ్గర వదిలేసి పరారయ్యారు. 

అయితే తనపై జరిగిన దాడిపై బాధితురాలు ఉప్పల్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం ఆ కేసును మియాపూర్‌ పోలిస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు సంగారెడ్డి, జనార్ధన్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. నిందితులు విచారణలో చేసిన దారుణాన్ని అంగీకరించారు అని పోలీసులు వెల్లడించారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)