Breaking News

లిటిల్‌ చెఫ్‌ ! అపుడు అన్నం తినడానికి మారాం, ఇపుడు యూట్యూబ్‌ స్టార్‌గా

Published on Tue, 10/22/2024 - 12:56

చిన్నారులకు అన్నం తినిపించాలంటే తల్లులకు పెద్ద టాస్క్‌. కథలు చెప్పాలి.. బుజ్జగించాలి.. లాలించాలి.. అంత చేసినా చివరకు సగం వదిలేస్తుంటారు. ఇప్పుడైతే మొబైల్‌ ఫోన్‌లో ఏదో ఒక కార్టూన్లు, రైమ్స్‌ పెట్టి తినిపించేస్తున్నారు. అసలు పిల్లలు ఏం తింటున్నారో కూడా వారికి తెలియట్లేదు. అలా వారిపై ఫోన్ల ప్రభావం ఉంటోంది. ఇలాగే ఈ చిన్నారి కూడా అన్నం తిననంటూ మారాం చేస్తుండేదట. కానీ ఆ పాప తల్లిదండ్రులు మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించారు. ఆ పాపతోనే వంటలు చేయించడం ప్రారంభించారు. వాటిని షూట్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి పలువురి ప్రశంసలు పొందుతున్నారు.  – సాక్షి, హైదరాబాద్‌

లిటిల్‌ చెఫ్‌.. తినేటప్పుడు ఏడుపు మానిపించడానికి చేసిన ప్రయత్నం ఆ పాపకు వంటలపై మక్కువను పెంచేలా చేశాయి. దీంతో ప్రస్తుతం ఆ పాప మరింత యాక్టివ్‌గా తన హావభావాలతో వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ పాప పేరే శ్రీనిత్య. బాచుపల్లిలో నివాసం ఉంటున్న నవీన్‌ చారి, శైలజ కూతురైన శ్రీనిత్య వయసు 8 ఏళ్లు. ప్రస్తుతం మూడో తరగతి చదువుకుంటోంది. కానీ వంటలతో పెట్టే వీడియోలతో యూట్యూబ్‌లో స్టార్‌గా మారింది.

ఇదీ చదవండి: ఫెస్టివ్‌ సీజన్‌లో మెరిసివాలంటే ఇదిగో చిట్కా, చిటికెలో మ్యాజిక్‌!

చిన్నప్పటి నుంచే ఆసక్తి.. 
నాలుగేళ్ల వయసు నుంచే పాప కిచెన్‌లోని వస్తువులతో గడిపేదట. పాప ఆసక్తి చూసిన తండ్రి కిచెన్‌ సెట్‌ కొనిచ్చాడు. ఇక ఎప్పుడూ వాటితోనే కాలం గడుపుతూ ఉల్లాసంగా ఉండేదట. అయితే అన్నం తినకపోయేదట. దీంతో పాపకు అన్నంపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో చిన్న చిన్న వంట పాత్రల్లో వంటకాలు చేయించడం నేరి్పంచారట. ఆ పాప చేసిన వంటకాలను చాలా ఇష్టంతో తినడం గుర్తించిన నవీన్‌.. ఓ రోజు పాప వంటలు తయారుచేస్తున్న సమయంలో వీడియోలు తీసి, ఇన్‌స్టాలో పెట్టాడు. బంధువులు, స్నేహితుల నుంచి ప్రశంసలు రావడంతో వీడియోలు తీయడం కొనసాగించాడు. అందుకోసం డ్రెస్‌లతో పాటు అన్ని రకాల మినియేచర్‌ వంట పాత్రలనూ కొనుగోలు చేశాడు. దాదాపు 5 ఏళ్ల వయసు నుంచే పాపతో వెరైటీ వంటకాలు చేయించడం, వాటిని అప్‌లోడ్‌ చేయడం చేస్తున్నాడు. శ్రీనిత్య చిన్నప్పటి నుంచే బుజ్జిగా మాట్లడటమే కాకుండా ముఖంలో హావభావాలు అద్భుతంగా పలికిస్తోంది. దీంతో వీక్షకులు కూడా పాప వంటకాలకే కాకుండా ఆమె ముఖ కవళికలకు కూడా ఫిదా అవుతున్నారు.  

ఆహారంపై ఆసక్తి పెంచాలి.. 
శ్రీనిత్యకు ఎలాగైనా ఆహారంపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో పాటు, వంటలు చేయడం ఎంత కష్టమో తెలియజేసేందుకు ఇలా వంటకాలు  నేర్పించాం. వీడియోలు తీసేటప్పుడు ఎలా చెబితే అలా చేస్తుంటుంది. అస్సలు అలిసిపోదు. వీడియో షూటింగ్‌ అనగానే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అటు స్కూల్‌లో కూడా బాగా చదువుకుంటుంది. వారాంతాల్లో ఎక్కువగా వంటలు చేయిస్తూ వీడియోలు తీస్తుంటాం. పాప వంటలు చేస్తుంటే ముద్దుముద్దుగా అనిపిస్తుంటుంది. వంటలు చేసుకుంటూ పిల్లలకు ఆసక్తి కలిగించే కథలు, మంచి మాటలు చెప్పిస్తుంటాం. 
– నవీన్‌ చారి నారోజు, నిత్య తండ్రి 

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)