Breaking News

ఘ‌నంగా అపోలో మెడిక‌ల్ కాలేజ్ కాన్వోకేష‌న్

Published on Mon, 12/02/2024 - 22:49

అపోలో మెడిక‌ల్ కాలేజ్ కాన్వోకేష‌న్ ఉత్స‌వం హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని రావినారాయ‌ణ రెడ్డి ఆడిటోరియంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ప్ర‌ముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంట‌రాలజిస్టు డాక్టర్ నాగేశ్వరరెడ్డి హాజ‌ర‌య్యారు. అపోలో మెడిక‌ల్ కాలేజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్  డాక్టర్ సంగీత రెడ్డి అత్యుత్తమంగా నిలిచిన విద్యార్థుల‌కు గోల్డ్ మెడల్ అంద‌జేశారు. 2018 బ్యాచ్ ఎంబీబీఎస్ చ‌దివిన 100 మంది విద్యార్థుల‌కు ప‌ట్టాలు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో  సీవోవో అప‌ర్ణా రెడ్డి, డీన్ మ‌నోహ‌ర్‌, మెడిక‌ల్ కాలేజ్‌ విద్యార్థులు, త‌ల్లితండ్రులు పాల్గొన్నారు.

జ‌న‌ర‌ల్ మెడిసిన్‌లో అవినాష్‌కు గోల్డ్ మెడ‌ల్
2018 బ్యాచ్ జ‌న‌ర‌ల్ మెడిసిన్‌కు గాను డాక్టర్ దండు అవినాష్ రెడ్డి గోల్డ్ మెడ‌ల్ అందుకున్నారు. "క‌ష్ట‌ప‌డి చ‌దవ‌డం వ‌ల్ల గోల్డ్ మెడ‌ల్ సాధించగ‌లిగాన‌ని, త‌ల్లితండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంద‌ని, అత్యుత్త‌మ విద్య బోధించినందుకు అపోలోకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని" అవినాష్ తెలిపారు. ఇక  డాక్ట‌ర్ ప్ర‌తాప్‌రెడ్డికి సంబంధించి ఛైర్మ‌న్ మెడ‌ల్‌ను సిద్ధాంత్ బ‌ర్మేచ అందుకున్నారు.

700 దాటిన‌ అపోలో మెడిసిన్ గ్రాడ్యుయేట్లు
అపోలో కాలేజ్ ప్రారంభించి ఇప్ప‌టికీ పుష్క‌రకాలం దాటింది. 2012లో ప్రారంభ‌మైన అపోలో మెడిక‌ల్ కాలేజ్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 700 మంది విద్యార్థులు డాక్ట‌ర్లుగా ఎదిగారు. ఇదే విష‌యాన్ని కాన్వోకేష‌న్‌లో ప్రస్తావించారు డాక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి. "భార‌త‌దేశంలోనే నాణ్య‌మైన వైద్య విద్య‌ను అందిస్తోన్న అపోలోలో చ‌దువుకునే అదృష్టం మీకు ద‌క్క‌డం గొప్ప విష‌యం. ఈ పునాదిని మ‌రింత బ‌లంగా మార్చుకుని వైద్యులుగా రాణించాల‌ని కోరుకుంటున్నాను. అలాగే నేర్చుకోవాల‌న్న మీ ధృడ సంక‌ల్పం జీవితాంతం కొన‌సాగాల‌ని ఆశిస్తున్నాను" అని అన్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)