Breaking News

ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే.. పెన్షన్‌ రద్దు

Published on Wed, 09/04/2024 - 17:24

సిమ్లా: పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీకి చేరకుండా ఉండేందుకు బుధవారం అసెంబ్లీలో ఓ కొత్త బిల్లును తీసుకువచ్చింది. పార్టీ మారితే ఎమ్మెల్యేల పెన్షన్‌ రద్దు చేసేలా ఆ బిల్లును రూపొందించింది. 

ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో.. సభ్యుల భత్యాలు ,పెన్షన్ (సవరణ బిల్లు)- 2024 పేరుతో నూతన బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఇక ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు కొత్త బిల్లు ప్రకారం పెన్షన్‌ రద్దు వర్తిస్తుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఏ సమయంలోనైనా ఎమ్మెల్యేలుగా అనర్హతకు గురైతే.. కొత్త బిల్లు ప్రకారం పెన్షన్‌కు అర్హులు కాదు’అని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఈ బిల్లు ప్రస్తావించింది.

ఇక..ఫిబ్రవరి 27న హిమచల్‌ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అనంతరం వారంతా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలకమైన బిల్లును ఆమోదించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)