Breaking News

సృష్టివాదులు ససేమిరా ఒప్పుకోని పరిణామ సత్యం

Published on Sat, 11/23/2024 - 17:24

ఒక అక్షరం, ఒక ఆలోచన, ఒక పుస్తకం సమాజాన్ని ప్రభావితం చేస్తాయా? ఆలోచనలు అనంతం. అక్షర శక్తి అనల్పం. ఇవి రెండూ ఏకమై పుస్తక రూపం తీసుకుంటే అది చూపే ప్రభావానికి ఎల్లలు ఉండవు. ఛార్లెస్‌ డార్విన్‌ 1859 నవంబర్‌ 24న వెలువరించిన ‘జాతుల పుట్టుక’ (ది ఆరిజిన్‌ ఆఫ్‌ స్పీసిస్‌) అనే గ్రంథం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. వచ్చిన తొలిరోజే 1,250 కాపీలు అమ్ముడు పోయాయంటే ఆ గ్రంథం సృష్టించిన సంచలనం ఎంతటిదో అర్థం చేసు కోవచ్చు. అంతగా సంచలనాత్మకం కావటానికి అందులో ఉన్నదేమిటి? డార్విన్‌ ఆ పుస్తకంలో ప్రతిపాదించిన ‘జీవ పరిణామ సిద్ధాంతం’! అది నూతన భావ విస్ఫోటనానికి నాంది పలికింది. నాటి వరకూ సమాజంలో పాతుకుపోయిన సృష్టివాద నమ్మకాలకు భిన్నంగా కొత్త అవగా హనకూ, ఆలోచనలకూ పట్టం కట్టడం. అందుకే పరిణామ సిద్ధాంతాన్ని ఎర్న్‌స్ట్‌ మయర్‌ అనే శాస్త్రవేత్త నూతన పథ నిర్దేశినిగా పేర్కొన్నాడు.

ఇంతకూ ఆ సిద్ధాంతం ఏం చెప్పింది? జీవులు... దగ్గర లక్షణాలున్న వాటి పూర్వీకులైన జీవుల నుండి పరిణామం చెందాయని. ఏ జీవీ ఉన్నది ఉన్నట్లుగా సృష్టి కాలేదనీ, ప్రకృతి పరిస్థితుల నెదుర్కొని దీర్ఘకాలంలో నేడు మనం చూస్తున్న జీవులు, జీవ వైవిధ్యం రూపుదిద్దుకున్నాయనీ. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ భూమిపై నివసించే ప్రతి జీవీ ప్రకృతి చెక్కిన శిల్పమే! ఇది ఒక భౌతిక ప్రక్రియ. ఇందులో ఏ అతీత శక్తుల ప్రమేయం లేదని ఆధారాలతో మరీ వివరించాడు డార్విన్‌. ఇదే సృష్టివాదులకు కంటగింపుగా మారింది. మనిషితో సహా అన్ని రకాల జంతు, వృక్ష జాతులనూ ఇప్పుడు ఉన్నట్లుగానే దేవుడు సృష్టి చేశాడనీ, అవి మార్పు చెందటం కొత్త జాతులు రావటం అనే ప్రసక్తే లేదని దాదాపు అన్ని మతాల నమ్మకం. ఆ నమ్మకానికి చేటు తెస్తుందనుకున్న ఏ సిద్ధాంతాన్నైనా, ఎన్ని నిరూపణలు చూపినా అంగీకరించేందుకు సృష్టివాదులు ససేమిరా ఒప్పుకోరు. అందుకే ఆదిలోనే మతం నుండి వ్యతిరేకతను, దాడిని ఎదుర్కోవలసి వచ్చింది.

అయినా ఈ సిద్ధాంతం 1930 నాటికి శాస్త్ర ప్రపంచ ఆమోదం పొందటం గమనార్హం. డార్విన్‌ చూపిన నిదర్శనాలు, ఇబ్బడిముబ్బడిగా సేకరించిన నమూనాలు, జీవ పరిణామ సిద్ధాంత ప్రతిపాదకుల్లో ఒకరైన ఆల్‌ఫ్రెడ్‌ రస్సెల్‌ వాలస్‌ మలయా దీవుల్లో కనిపెట్టిన అనేక జంతుజాతుల విశేషాలు సృష్టివాదుల నోరు కట్టేశాయి. డార్విన్‌ కాలం నాటి కంటే తరువాతి కాలంలోనే పరిణామాన్ని బలపరిచే ఎన్నో రుజువులు బయటపడినాయి. జీవించి ఉన్న జాతులను, గతించిన జాతులతో అనుసంధానించే అనేక మధ్యంతర జీవులు శిలాజాల రూపంలో దొరకటం డార్విన్‌ సిద్ధాంతాన్ని మరింత బలపరిచాయి. 

చ‌ద‌వండి: ఆదివాసులకు చేయూతనిద్దాం!

శిలాజాలే కావు నేటి ఆధునిక పరిశోధనలు, జీనోమ్‌ సమాచారం సైతం డార్విన్‌ పరిణామ సిద్ధాంత విశిష్టతను, సత్యాన్ని చాటడం విశేషం. ఇంతటి ప్రభావశీలమైన జీవ పరిణామ సిద్ధాంతాన్ని వెల్లడించిన గ్రంథం వెలువడిన నవంబర్‌ 24వ తేదీని ‘అంతర్జాతీయ జీవ పరిణామ దినం’గా ప్రపంచం జరుపుకొంటోంది. పరిణామ విశ్వజనీనతనూ, సత్యాన్నీ ప్రజల ముందుంచే పనిని సైన్సు ప్రచార సంస్థలు భుజానికెత్తుకుని పరిణామ దినోత్సవాన్ని జరుపుతున్నాయి.

– ప్రొఫెస‌ర్‌ కట్టా సత్యప్రసాద్, జన విజ్ఞాన వేదిక ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షులు
(నవంబర్‌ 24న అంతర్జాతీయ జీవ పరిణామ దినోత్సవం) 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)