Breaking News

BirthrightCitizenshipOrder: మనవాళ్లకు భరోసా కావాలి!

Published on Wed, 01/29/2025 - 10:09

ప్రపంచం ఒక గ్లోబల్‌ విలేజ్‌ (Global Village) అయిన తరుణంలో జనం మెరుగైన జీవనం గడపడానికి అవకాశాలు ఉన్న చోటుకు వెళ్లి జీవిస్తున్నారు. ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న భారతదేశం (India) నుంచే అత్యధికంగా ఇతరదేశాలకు వలస వెళు తున్నారు. 2024 ఐక్యరాజ్యసమితి ప్రపంచ వలస నివేదిక (యూఎన్‌ వరల్డ్‌ మైగ్రేషన్‌ రిపోర్ట్‌) ప్రకారం కోటీ ఎనభై లక్షలమంది దాకా ఆ ఏడాది భారత్‌ నుంచి వలస పోయారు. 

భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం 2024 మే నాటికి వివిధ దేశాల్లో ఉన్న భారతీయుల సంఖ్య దాదాపు మూడు కోట్ల 92 లక్షల మంది. ఇందులో రెండుకోట్ల 35 లక్షలమంది ఎన్‌ఆర్‌ఐలు (NRIs) ఉన్నారు. మిగతావారు భారతీయ సంతతికి చెందినవారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే అత్యధికంగా (54 లక్షలు) అమెరికాలోనే పనిచేస్తున్నారు. ఇది అమెరికా జనాభాలో 1.6 శాతంగా ఉంది. 

వ్యాపారాలు చేస్తూ, పన్నులు చెల్లిస్తూ అపరిమిత ఆదాయాన్ని అమెరికాకు సాధించి పెడుతున్నప్పటికీ అమెరికాలో ప్రెసిడెంట్‌ మారినప్పుడల్లా అభద్రతా భావంతో మనవారు కునారిల్లుతున్నారు.  47వ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) విదేశీయులకు అమెరికా గడ్డమీద జన్మించే పిల్లలకు జన్మతః లభించే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఆర్డర్‌ జారీచేశారు.(దీన్ని అక్కడి కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది). 

Birthright citizenship : ట్రంప్‌ ఆర్డర్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్‌ఆర్‌ఐలకు భారీ ఊరట

దీంతో అనేకమంది అమెరికాలో నివసిస్తున్న భారతీయ గర్భిణులు ట్రంప్‌ విధించిన గడువులోపు పిల్లల్ని బలవంతంగా కనడానికి ఆస్పత్రుల దగ్గర బారులు తీరారంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతుంది.అమెరికాలోని ప్రవాస భారతీయులకు మన కేంద్ర ప్రభుత్వం ఆత్మస్థైర్యం కల్పించే చర్యలు తీసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీకి  డొనాల్డ్‌ ట్రంప్‌తో ఉన్న స్నేహం మనవారికి మేలు చేస్తుందేమో చూడాలి. 

చదవండి: హోటల్లో అంట్లు కడిగాడు, ఆత్మహత్యాయత్నం..కట్‌ చేస్తే.. రూ 500 కోట్లు


– ఎండి. మునీర్, సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)