Breaking News

అసలైన ప్రార్థన అంటే?

Published on Thu, 08/22/2024 - 13:42

మన శాస్త్రాల్లో సాధకులకు ఉపయోగపడే వందల కొలది మార్గాలు ఉన్నాయి. ప్రపంచంలో వేల కొలది బోధకులు ఉన్నారు. మన సంప్రదాయాలను అనుసరించి భగవంతునికి కోట్లాది రూపాలున్నాయి. సాధకులు తమ మార్గాలను, గురువులను, వారు పూజించు దేవుళ్ళను మార్చుకోవడం చూస్తూ ఉంటాం. ఆ విధంగా చేయడం సరైనదే కావచ్చు, కాకపోనూ వచ్చు. కానీ లక్ష్యాలను చేరుకోవడానికి వారు చూపించే ఉత్సాహం మెచ్చుకోతగింది. అటువంటివారి దృష్టి అంతా ఎల్లప్పుడూ ఆదర్శమార్గం, ఆదర్శ గురువు, ఆదర్శప్రాయమైన భగవత్‌ స్వరూపం పైననే ఉంటుంది. వారు ఏ మార్గాన్ని అనుసరించినప్పటికీ, ప్రయాణం మాత్రం అంతరాత్మ లోనికే అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.

గురువులందనూ బోధించే సత్యం ఒకటే. భగవంతుని ఏ స్వరూపంలో పూజించినప్పటికీ, అది సర్వేశ్వరుని పూజించినట్లే. వారు ఎంచుకొనే మార్గం, అనుసరించే గురువు, ఆరాధించే భగవత్‌ స్వరూపం... ఇవన్నీ సాంకేతికంగా భగవంతుని సూచిస్తాయి. నీవు నీ మార్గాన్ని గంభీరంగా, భక్తిపూర్వకంగా నిశ్చిత బుద్ధితో అనుసరించడమే ముఖ్యం. ప్రపంచంలోని అన్ని మతాలవారికీ  ప్రార్థన ఉంది. అయితే చేసే విధానాలు విభిన్నంగా ఉండవచ్చు. కాని ఇది అందరికీ ముఖ్యమైనది. కేవలం మానవులకు మాత్రమే ప్రార్థన అనేదాన్ని భగవంతుడు అనుగ్రహించాడు. ప్రార్థన చాలా శక్తిమంతమైనది. మనకు ఆపదలు, దుఃఖం కలిగినప్పుడు మాత్రమే సాధారణంగా భగవంతుని ప్రార్థిస్తాం.

దీనిలో నష్టం ఏమీ లేదు. అయినప్పటికీ, అన్ని పరిస్థితుల్లో భగవంతుని ప్రార్థించడం అలవరచుకోవాలి. వ్యక్తిత్వాన్ని సరిచేసుకోవడం, ఆత్మవికాసమే ప్రార్థన ముఖ్య ఉద్దేశాలుగా ఉండాలి. భౌతిక అవసరాలను లేక కోరికలను తీర్చు కోవడానికి భగవంతుని ప్రార్థించకూడదు. కాబట్టి నీవు చేసే  ప్రార్థన బంధ విముక్తి కోసం చేయాలి. ఎట్టి పరిస్థితిలో అయినా ఆ దేవదేవుని మరచిపోకుండా ఉండేట్లు ఉంచమని ఆయననే ప్రార్థించాలి. కొన్ని విషయాలు మనకు సంతోషం కలిగించవు. అందువలన బాధ కలుగుతుంది. అటువంటి విషయాలను  ప్రార్థన ద్వారా దేవుని అడుగరాదు. అదే నిజమైన ప్రార్థన. నీ ప్రార్థన భగవంతుని నియమానుసారానికి లోబడి ఉండాలి. అందుకు తగినట్లు నిన్ను నీవు మలచుకోవాలి.


– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)