Breaking News

ఎవరిని మభ్యపెట్టాలని ఈ చట్టాలు?

Published on Fri, 09/13/2024 - 09:15

కొత్త న్యాయ చట్టాలను తీసుకు వచ్చామని ఆర్భాటంగా ప్రకటించి అమలుకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం ఒక్క విషయాన్ని స్పష్టం చేయాలి: ఆ చట్టాలను ప్రభుత్వం కొత్తగా రూపొందించిందా లేక పాత చట్టాల నుంచి వివిధ అంశాలను స్వీకరించిందా? ఎందుకంటే పేరుకు కొత్త చట్టాలే కాని వీటిలో అధిక భాగాలు పాత చట్టాల నుంచి కాపీ కొట్టినవేనని న్యాయశాస్త్ర కోవిదులు చాలా మంది ప్రకటిస్తున్నారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌ తరుణబ్‌ ఖైతాన్‌ ఈ చట్టాలను ‘టర్ట్‌ ఇట్‌ ఇన్‌’ అనే టెక్నాలజీని ఉపయోగించి  పరిశీలించినప్పుడు బయటపడిన అంశాలు ఈ సందర్భంగా గమనార్హం.

1. భారతీయ న్యాయ సంహిత –2023లోని 83 శాతం అంశాలు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 1860 (పాత బ్రిటిష్‌ చట్టం) నుంచి కాపీ, పేస్ట్‌ చేసిందే.
2. భారతీయ నాగరిక సురక్ష సంహిత– 2023ను అంతకు ముందున్న కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌–1973 నుండి 82 శాతం తీసుకున్నదే.
3. భారతీయ సాక్ష్య చట్టం–2023 అంతకుముందు అమ లులో ఉన్న ఇండియన్‌ ఎవిడెన్స్‌ చట్టం–1872 నుంచి 82 శాతం మక్కీకి మక్కీ కాపీ కొట్టినదే.

ఈ సందర్భంగా కాపీ కొట్టడం గురించి కొంత వివరణ చూద్దాం. నల్సార్‌ యూనివర్సిటీలో నేను పనిచేస్తున్న ప్పుడు వేపా పార్థసారథి (వీపీ సారథి) అనే అద్భుతమైన ప్రొఫెసర్‌ ఉండేవారు. ఆయన సాక్ష్య చట్టంలో ప్రముఖ నిపుణుడు. మొత్తం చట్టం ఒక్కో అక్షరం, పదం, కామా, ఫుల్‌స్టాప్‌ వంటి అర్థాలను చక్కగా వివరించేవారు.

ఓసారి జడ్జీలకు క్లాస్‌ చెబుతున్నారు. ‘సాక్ష్య చట్టంలో ఇలా ఉంది సార్‌’ అని ఓ వ్యాఖ్యానం ప్రతిపాదించారు ఓ జడ్జిగారు. వారు చాలా బాగా అధ్యయనం చేసిన జడ్జి గారు. అప్పుడు సారథిగారు ‘మీరు ఈ కామా గురించి చూడాలి. అందువల్ల దాని అర్థం మారిపోతుంది’ అని వివరించడంతో జడ్జి అవాక్కయ్యారు. అంత సునిశితంగా పరిశీలించే సారథిగారు మన పాత నేర చట్టాలపై తన అభిప్రాయాన్ని ‘పాతదే అయినా మన సాక్ష్య చట్టాన్ని 90 శాతం సవరించాల్సిన అవసరం లేదు, కొన్ని మంచి సంస్క రణల అవసరం ఉంది’ అని కుండబద్దలు కొట్టారు. ప్రతి పాఠాన్నీ సున్నితమైన హాస్యంతో కలిపి అద్భుతంగా క్రిమినల్‌ లా సూత్రాలను చెప్పేవారాయన.

ఆయన కాపీ కొట్టే విషయంలో ఒక జోక్‌ చెప్పేవారు. ఓ విద్యార్థికి ఓ అంశం మీద 5 పేజీల వ్యాసం రాయాలని పరీక్ష పెట్టారు. ఆ విద్యార్థి ఎవరిదో పరిశోధనాపత్రంలోని విషయాలను చక్కగా దించేశాడు. కానీ పరిశోధనా పత్రం రాసిన స్కాలర్‌ పేరును మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. అయితే ఆ పరీక్ష పేపర్‌ దిద్దుతున్న ప్రొఫెసర్‌ అది తన వ్యాసాన్ని కాపీ కొట్టి రాసిన జవాబుగా గుర్తించారు. ప్రశ్నకు 10 మార్కులకు గాను 8 మార్కులు ఇచ్చారు. విద్యార్థి ‘సార్‌ నేను ఫెయిల్‌ అవుతాననుకున్నాను. మీరు 8 మార్కులు ఇచ్చారే ఆశ్చర్యం’ అన్నాడా విద్యార్థి క్లాసులో. అందుకు ‘నిజమే, అప్పట్లో మా ప్రొఫెసర్‌  నే రాసిన ఈ జవాబుకు చాలా తక్కువగా 4 మార్కులే ఇచ్చారు. ఇప్పటికీ నేనే కరెక్టు రాశానని నా నమ్మకం. అదే రాసిన నీకు నేను 8 మార్కులు ఇచ్చాను’ అన్నారట ప్రొఫెసర్‌. దీంతో విద్యార్థి నోరెళ్ల బెట్టా డట. అటువంటి పార్థసారథిగారు ఇప్పుడు జీవించి లేరు. కానీ, ఆయన అభిప్రాయాలు మాత్రం నిలిచే ఉన్నాయి.

ఇండియన్‌ ఎవిడెన్స్‌ చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేనే లేదనీ, ఒకవేళ ఎవరైనా మార్చితే దాన్ని ప్రభుత్వాలు దుర్మార్గం చేయడానికే వాడతాయనీ ఆయన అనేవారు. ఎవిడెన్స్‌ చట్టాన్ని నేను కూడా బోధించే వాడిని. అందుకే నేను కొన్ని మార్పులు, సూచనలు చేశాను. సారథిగారు ఒక రోజంతా చదివి ఆలోచించి, మరునాడు నల్సార్‌లో నా గదికి వచ్చి, ‘మీరన్నది కరెక్టే, కొన్ని మార్పులు చేయడం అవసరమే’ అని ఒప్పుకోవడమే కాకుండా, తరువాత వచ్చే ఎడిషన్‌లో ‘ప్రొఫెసర్‌ శ్రీధర్‌ సలహా ఇచ్చారు’ అనిముందుమాటలో నా పేరు రాశారు. ఎంత గొప్పవ్యక్తి ఆయన! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒకరి అభిప్రాయమో, లేక పుస్తకం, వ్యాసాల్లో ఉన్న విషయాలనో మనం ఉపయోగించి ఏమైనా రాసేటప్పుడు తప్పనిసరిగా సోర్స్‌ను ఉటంకించడం కనీస ధర్మం. ప్రొఫెసర్‌ పార్థసారథి చేసింది అదే. ఇంగితం ఉన్న ఎవరైనా చేయాల్సిందీ అదే!

పాత బ్రిటిష్‌ కాలపు క్రిమినల్‌ చట్టాలను పూర్తిగా సంస్కరించుకునే బంగారంలాంటి అవకాశాన్ని ప్రభుత్వం, పార్లమెంట్, ఎంపీలు పూర్తిగా వదిలేసుకున్నారని మా నల్సార్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి... ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ‘నేషనల్‌ లా యూనివర్సిటీ’ ప్రొ‘‘ అనూప్‌ సురేంద్రనాథ్‌ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి ఏమర్థమవు తోంది? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ కొత్త నేర చట్టాలు?


– మాడభూషి శ్రీధర్‌. వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ, ‘స్కూల్‌ ఆఫ్‌ లా’లో ప్రొఫెసర్‌

ఇవి చదవండి: Acharya Aatreya: అక్షర లక్షలు... ఆ గీతాలు!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)