నమ్మొద్దు బాబో... నంగనాచి కూటమిని!

Published on Wed, 01/29/2025 - 00:31

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కూటమి (డబల్‌ ఇంజన్‌) మాటలకు, చేతలకు మధ్య ఏమీ సంబంధ ముండదు. పార్లమెంటులో, అసెంబ్లీల్లో ఒకటి మాటాడతారు, ఇంకొకటి చట్టం చేస్తారు. ఒకో నాయకుడు ఒకో వ్యాఖ్యానం చేస్తాడు. ఒకరు ఎవరి మీదనో ఏదో ఆరోపణ చేస్తారు. మరొకరు ఆ ఆరోపణను సంశయించేట్టు మాటాడతారు. వీరే ఇలా ఉంటే వీరి తెర వెనక దర్శకులు వేరే ఏదో మాటాడతారు. గందరగోళం శృష్టించడం, జనాలను అయోమయంలో పడేయడంలో కూట మిలో జాతీయ, రాష్ట్రీయ గురువులే కాక విశ్వ గురువులూ ఉన్నారు. 

తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారానికి పదకొండు వేల నాలుగు వందల కోట్లు సహాయం అంటుంది కేంద్రం. డబల్‌ ఇంజన్‌లో భాగంగా రాష్ట్ర పాలకులు ‘మాది ఉక్కు సంకల్పం’ అంటా వంత పాట ఎత్తుకున్నారు. ‘కూటమి ఘన చర్య ఇది’ ఆనంటూ పాత పాలకుల వలననే విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల పాలయిందని రాజ కీయ రాగం తీస్తున్నారు. నిజానికి ఇపుడు ప్రక టించిన ఈ ఆర్థిక సహాయం విశాఖ ఉక్కు కర్మా గారాన్ని ఒడ్డెక్కించే సహాయమేనా? 

సొంత గనులు లేకపోవడం, ఉత్పత్తికి తగిన మార్కెట్‌ సదుపాయం లేకపోవడం, పెట్టుబడుల లోపం వంటి ప్రధాన అంశాలు కారణాలు. వీటిని సమకూర్చని పాలకులే ప్రస్తుత పరిస్థితికి అసలు కారకులు. ఏమాత్రం విచక్షణతో ఆలోచించినా ఈ కారణాలు తెలుస్తాయి. ఒకవేళ ఆలోచ నకు అందకపోయినా... ఆ కర్మాగార కార్మికులు వందలాది రోజులుగా ఉద్యమం చేస్తూ, విగ్యా పన పత్రాలిస్తూ, కడుపు కాల్చుకొని దీక్షలు చేస్తూ ఘోషిస్తున్నారు. ఆ ఘోష వింటే అర్థమౌతుంది. 

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ తప్పనిసరి పరిస్థితుల్లో... ఆర్థిక పెనుభారం నుండి కాపాడ టానికి తీసుకున్న చర్యగా సమర్థించుకోడానికీ, మునుముందు డబల్‌ ఇంజన్‌ మోత మోగించ డానికీ వేసిన వేటగాడి నూకలు ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్లు. దీనితో ఉక్కు కర్మా గారం ఒడ్డున పడదు. బ్యాంకుల్లో అప్పులే పన్నెండు వేల కోట్లు ఉన్నాయి. ఉద్యోగుల జీతాల బకాయిలు ఉన్నాయి. మరికొన్ని తక్షణ బకాయిలకు ఈ కోట్లు ఖర్చవుతాయి. దానితో మళ్ళీ అప్పుల్లో, నష్టాల్లో మునిగే స్థితి కొద్దినాళ్ల లోనే వస్తుంది. 

అప్పుడు డబల్‌ ఇంజన్‌ ... ‘చూశారా? నష్టాలను తప్ప లాభాలను ఉత్పత్తి చేయలేని కర్మాగారాన్ని సెంటిమెంట్‌తో ఎన్నాళ్ళు మోస్తాం? ప్రభుత్వ ధనం ఎన్నాళ్లు వృధా చేస్తాం? ప్రైవేటీకరించడమే పరిష్కారం’ అని చెబుతుంది. ఈ సమర్థన కోసం చేసిన సాయం మాత్రమే ఇది. వందలాది రోజులుగా ఐక్యంగా కార్మికులు చేసే పోరాటాన్ని నిర్బంధాలతో, బలప్రయోగాలతో అణచివేయడం ఇప్పట్లో సముచితం కాదని డబల్‌ ఇంజన్‌ భావించడమే ఈ సహాయానికి కారణం.  
  
నిజంగా ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలంటే సొంత గనులు ఏర్పాటు చేయాలి. విద్యుత్‌ ఛార్జీలు కూడా వసూలు చేయడం లేదంటున్న బాబు... కర్మాగారం తాలూకా ధర్మల్‌ విద్యుత్‌ విభాగాన్ని పునరుద్ధరిస్తే... తిరిగి కర్మాగారమే తమ అవస రాలు తీర్చుకొని, మిగిలిన దాన్ని రాష్ట్రానికిస్తుంది. అలాగే బ్యాంక్‌ రుణాలకు కొన్నాళ్లు గడువు ఇప్పించడం... లేదా ఆ రుణాన్ని ప్రభుత్వాల వాటాగా మార్చడం, ‘స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ (సెయిల్‌)లో విలీనం చేయడం వంటి చర్యలు మాత్రమే విశాఖ ఉక్కు కర్మాగార పరిస్థితిని చక్క దిద్దుతుంది. 

అపుడే అది లాభాల బాటలో నడు స్తుంది, దేశానికి సంపద సృష్టిస్తుంది. ఈ దిశగా చర్యలు ఉండాలని, ముందుగా ‘విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించం’ అని డబల్‌ ఇంజన్‌ ఒక అధికార ప్రకటన ఇవ్వాలని ఉక్కు కార్మికులే కాదు, తెలుగు ప్రజలంతా కోరుకుంటున్నారు. అంతదాకా కార్మికులారా... ‘నమ్మొద్దు బాబో కూటమి నాటకాలను’ అంటున్నారు. 

అట్టాడ అప్పల్నాయుడు 
వ్యాసకర్త ఉత్తరాంధ్ర రచయితలు, కళాకారుల వేదిక అధ్యక్షులు

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)