Breaking News

జనహృదయ విజేత

Published on Mon, 07/08/2024 - 08:27

సమైక్య రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేసిన ఏకైక నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి. ఆయన పేద ప్రజల్లో దైవంలా కొలువై నిలిచారు. అధికారాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే రాజకీయ నాయకులున్న రోజుల్లో... వైఎస్సార్‌  పేద ప్రజల బాగుకోసం దాన్ని ఉపయోగించారు. ‘ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 108 అంబులెన్స్‌ సర్వీసులు ప్రారంభించారు.

ఆ విధంగా ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు దగ్గర చేశారు. పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి చలించిపోయిన ఆయన దేశానికి వెన్నెముక వ్యవసాయమేనని బలంగా విశ్వసించి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ‘జలయజ్ఞం’ ఆరంభించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు అండగా నిలిచారు. ఆయన కాలంలోనే ఎన్నో విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణాలు జరిగాయి. రైతులకు ఉచిత విద్యుత్‌ అందించారు. ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచారు.

దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని తీసుకువచ్చి ఇంజనీరింగ్, వైద్య విద్యలను అందించి అనేక మందిని ఇంజనీర్లుగా, వైద్యులుగా తీర్చిదిద్దారు. ప్రతి నిరుపేదకూ ‘ఇందిరమ్మ ఇల్లు’ పేరిట రాష్ట్రంలో లక్షల ఇళ్లను కట్టించి పేదవారి సొంతింటి కలను నిజం చేశారు. నిరుపేద ముస్లిం యువతకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. పండుటాకుల వంటి వృద్ధులకు పింఛన్‌ను క్రమం తప్పకుండా ఇచ్చి వారి ఆకలి తీర్చారు.

ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్‌ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ వార్త విని ఎందరో అభిమానుల గుండెలూ ఆగిపోయాయి. ఆయన భౌతికంగా లేకపోయినా సకల జనుల హృదయాల్లో ‘రాజన్న’గా ఆయన నిలిచే ఉన్నారు. – సంపత్‌ గడ్డం, కామారెడ్డి జిల్లా

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)