Breaking News

పట్టనట్లు నెహ్రూ... పంతంతో పటేల్‌!

Published on Mon, 09/23/2024 - 00:24

కొన్ని చారిత్రక సంఘటనలు దశాబ్దాలు దాటినా కూడా చర్చనీయాంశాలుగా కదలాడుతూనే ఉంటాయి. అలాంటి అంశమే 1948లో జరిగిన హైదరాబాద్‌ యాక్షన్‌. ‘ఇండియా ఇండిపెండెన్స్‌ యాక్ట్‌’ ద్వారా భారత ఉపఖండాన్ని భారత్, పాక్‌లుగా విభజిస్తున్నట్టు అప్పటి బ్రిటిష్‌ ప్రధాని క్లెమెంట్‌ ఆట్లీ 1948 జూన్‌ 3న ప్రకటించి ఉపఖండంలోని 562 రాచ రిక రాజ్యాలు ఇక నుండి ఏదో ఒక దేశంలో విలీనం అవొచ్చు లేదా, స్వతంత్రంగా ఉండొచ్చు అని తేల్చి చెప్పారు. 

దీనికి హైదరాబాదు 7వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ జూన్‌ 11న స్పందిస్తూ, హైదరాబాదు సంస్థానం స్వతంత్ర ఇస్లామిక్‌ దక్కన్‌ రాష్ట్రంగా ఉంటుందని ప్రకటించారు. వెంటనే ముస్లిం లీగ్‌ నాయకుడు మహమ్మద్‌ అలీ జిన్నా, ‘‘నిజాం ప్రతిపాద నకు బేషరతుగా పాకిస్తాన్‌ మద్దతుంటుంది’’ అని తెలిపారు. దాంతో 82,688 చదరపు మైళ్ల విస్తీర్ణంలో, 85 శాతం హిందూ, 13 శాతం ముస్లిం జనాభాతో ఉన్న హైదరాబాదు మున్ముందు ప్రజా స్వామ్య, లౌకిక, స్వతంత్ర భారతదేశానికి కొరకరాని కొయ్యగా మారుతుందని అప్పటి రాజకీయ నేతలు ఊహించారు.

ఆ క్రమంలో రాచరిక రాష్ట్రాల రాజులు ‘ఛాంబర్‌ ఆఫ్‌ ప్రిన్సెస్‌’ కూటమిగా ఏర్పాటై, 1947 ఆగస్టు తర్వాత తమ తమ ‘ఇలాఖా’లను భారతదేశంలో విలీనం చేశారు. కశ్మీరు, జునాఘఢ్, హైదరాబాదు రాష్ట్రాలు మాత్రం దీనికి ససేమిరా అన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాదును భారత్‌లో కలపడానికి వీల్లేదని ప్రకటించిన ‘మజ్లిస్‌–ఎ–ఇత్తెహాదుల్‌–ముస్లిమీన్‌’ నేత ఖాసీం రిజ్వీ 1948 ఫిబ్రవరి నుండి రెండు వేల మంది ముస్లిం రాడికల్‌ యువకులను గ్రామీణ ప్రాంతాల్లో హిందువులపై అరాచకాలకు, స్త్రీలపై అనేక అమానుష చర్యలకు పురిగొలిపాడు. 

ఇదేమి పట్టనట్టుగా ఉండి పోయాడు మీర్‌ ఉస్మాన్‌ అలీ. హైదరాబాదులో హిందువులపై జరుగుతున్న హత్యాచారాలను భారత ప్రభుత్వం అరికట్టాలని ఉపప్రధాని సర్దార్‌ పటేల్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ మీటింగులో గళ మెత్తారు. అయినా ప్రధాని నెహ్రూ, ఆయన విధేయులు నోరు మెదప లేదు!

భారత్‌పై మిలిటరీ దాడికి 1948 జూన్‌ నుండే నిజాం ప్రభుత్వం ఐరోపా నుండి మెషీన్‌ గన్స్‌, గ్రెనేడ్లు, ఫైటర్‌ విమానాలను కరాచీ (పాకిస్తాన్‌)కి, అటునుండి సముద్రం ద్వారా పోర్చుగీసు ఆధీనంలోని గోవాకు తరలించి, ఆ తర్వాత హైదరాబాదుకు చేరవేయటం ఆరంభించింది. 

ఇక సమయం ‘బర్బాద్‌’ చేస్తే నష్టమే అనుకుని, తన సన్నిహి తులు వి.పి.మీనన్, హెచ్‌.వి. అయ్యంగార్, డిఫెన్స్‌ సెక్రటరీ హెచ్‌.ఎం. పటేల్‌ పర్యవేక్షణతో ‘ఆపరేషన్‌ పోలో’ అనే సీక్రెట్‌ కోడ్‌తో హైదరాబాదుపై విరుచుకుపడటం కోసం పథకం వేశారు వేశారు ‘ఉక్కు మనిషి’ పటేల్‌. ఆర్మీ జనరల్‌ జయంతో నాథ్‌ చౌధురీ ఇన్‌చార్జిగా పుణె కంటోన్మెంటులో సరిపడా యుద్ధ సామగ్రి, గోర్ఖా రైఫిల్స్, బర్మా బెటాలి యన్‌ ఫౌజీలను ఆగస్టు నెలలోనే సిద్ధం చేశారు. 

ఆపరేషన్‌కు ముందు సెప్టెంబర్‌ 8న కేబినెట్‌ మీటింగులో, ‘‘పరిస్థితి చేయి దాటక ముందే హైదరాబాదును ముట్టడించాలి. దేశం నడి బొడ్డులోని ఈ పుండును ఇలా వదిలేస్తే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరం’’ అని తేల్చేసిన పటేల్‌పై చిందులు తొక్కారు నెహ్రూ! ఆయనతో వాదించదలచు కోలేదు సర్దార్‌. 1948 సెప్టెంబర్‌ 12న షోలాపూర్‌ దగ్గర గంగాపూర్‌ రైల్వే స్టేష న్‌లో కొందరు హిందువులను రజాకార్లు, భారత భూభాగంలో చొరబడి హత మార్చారు. ఈ వార్త ఢిల్లీ చేరటమే తడవు, ఆపరేషన్‌ పోలోకు గ్రీన్‌ సిగ్నల్‌ పంపారు.

మరుసటి రోజు, సెప్టెంబర్‌ 13న ఉదయం 4 గంటల నుండి భారత బల గాలు బళ్లారి, షోలాపూర్, అహ్మద్‌నగర్, విజయవాడ మీదుగా నైజాం స్టేట్‌ నలు వైపులా సరిహద్దులను దాటుతూ హైదరాబాదు నగరం వైపు కదిలాయి. ఈ ఆకస్మిక ఆక్ర మణకు నీరుగారి పోయాడు నిజాం ఆర్మీ చీఫ్‌ మహమ్మద్‌ ఇద్రూస్‌. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ సామగ్రిని వాడే శిక్షణ లేక పోవటంతో వారి తుప్పుపట్టిన తుపాకులు, జీపులు భారత సైన్యాన్ని ఎదుర్కోలేక పోయాయి. 

సెప్టెంబరు 17 మధ్యాహ్నం సికింద్రాబాదు కంటోన్మెంట్‌కు 5 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది ఇండియన్‌ ఆర్మీ. పరిస్థితి క్షీణించటంతో ఉస్మాన్‌ అలీ ఖాన్, ఆర్మీ చీఫ్‌ ఇద్రుస్‌ ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాళ్ల బేరానికి వచ్చాడు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు నిజాం రాజు ఉస్మాన్‌ అలీఖాన్‌ రేడియో ప్రసంగం ద్వారా తన ప్రభుత్వాన్ని రద్దుచేసి, భారత సైనిక బలగాలకు లొంగిపోయినట్టు ప్రకటించారు.

జిల్లా గోవర్ధన్‌ 
వ్యాసకర్త విశ్రాంత అధికారి, ముంబై
(2023లో విడుదలైన జాన్‌ జుబ్రిచ్చికి ‘డీథ్రోన్డ్‌: పటేల్, మేనన్‌
అండ్‌ ది ఇంటిగ్రేషన్‌ ఆఫ్‌ ప్రిన్స్‌లీ ఇండియా’ ఆధారంగా.)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)