Breaking News

మోహన్‌లాల్‌ (అగ్ర నటుడు) రాయని డైరీ

Published on Sun, 03/01/2026 - 01:48

ముఖ్యమంత్రి అధికార నివాసం ‘క్లిఫ్‌ హౌస్‌’లోని పచ్చికలో పినరయి విజయన్, నేను పక్కపక్కన నడుస్తున్నాం. ఇంటర్వ్యూ ఇంకా మొదలు కాలేదు. ‘‘ఒకటి చెప్పండి సీఎం గారూ! మీరెందుకు ఎక్కడా కూడా నవ్వుతూ కనిపించరు?! మోదీజీని చూడండి, నిరంతరం నవ్వుకు అందుబాటులో ఉంటారు. రాహుల్‌ గాంధీ అయితే, ‘నవ్వు పిట్ట’లా ఎప్పుడూ ఎవరో ఒకరి భుజం మీద వాలుతూనే ఉంటారు. మీరెందుకు అలా ఉండరు?’’ అని అడిగాన్నేను. ‘‘చూడండి మిస్టర్‌ లాల్‌... ‘నవ్వని మనిషి’ అని నా మీద ఈ పదేళ్లలో చాలానే దుష్ప్రచారం జరిగింది! నిజానికి, నేనూ నవ్వగలను’’ అన్నారు విజయన్‌ , సీరియస్‌గా.

‘‘కానీ, సీఎం గారూ... నవ్వటం, నవ్వగలగటం రెండూ ఒకటేనంటారా?! నవ్వగలిగి ఉండీ, నవ్వక పోవటం అంటే నవ్వును ఆచరణలో పెట్టకపోవటమే కదా?’’ అన్నాను. ఆ మాటకు ఆయన నవ్వే ప్రయత్నం చేశారు కానీ, నవ్వటం ఆయన వల్ల కాలేదు. ‘‘ఆచరణలో పెట్టటానికి ‘నవ్వు’ అనేది పార్టీ సిద్ధాంతం కాదు మిస్టర్‌ లాల్‌! సహజసిద్ధమైన ఒక మెరుపు. నాలో మెరుపు కనిపించకుండానే నేను ఉరుమునై పోతానా! ముందు మెరుపు కనిపిస్తేనే కదా, తర్వాత ఉరుము వినిపిస్తుంది. నాలో మెరుపే లేకుంటే వీళ్లంతా అంటున్నట్లు ఉరుము ఎక్కడి నుంచి వస్తుంది! అది చెప్పండి’’ అన్నారు విజయన్‌ .

మెల్లిగా ఆయన ఇంటర్వ్యూ మోడ్‌లోకి వస్తున్నట్లు నేను గ్రహించాను. ఇంటర్వ్యూ పేరు ‘ఇరువర్‌’. ‘విజయన్‌ సీరియస్‌ మనిషి’ అనే ఇమేజ్‌ని పోగొట్టి, విజయన్‌ కూడా మామూలు మనిషే! ఆయనా సినిమాలు చూస్తారు, ఆయనా పూల మొక్కల్ని చూసి ఆహ్లాదపడతారు అనే కొత్త ఇమేజ్‌ను తీసుకురావడమే ‘ఇరువర్‌’ ఉద్దేశం. 2019లో ప్రధాని మోదీజీని అక్షయ్‌ కుమార్‌ ఇంటర్వ్యూ చేస్తూ, ‘‘మోదీజీ! మీరు మామిడి పండ్లను ఎలా తింటారు? కోసుకుని తింటారా? లేక, కొరుక్కుని తింటారా?’ అని అడిగిన అత్యద్భుతమైన ప్రశ్న ఆనాడు దేశ ప్రజల్ని ఉర్రూతలూగించింది. ఆ ఒక్క ప్రశ్నతో మోదీజీని దేశానికి ప్రియతమ నాయకుడిని చేసేశారు అక్షయ్‌.

‘‘మోహన్‌ లాల్‌ గారూ! మీరు కూడా అక్షయ్‌ లానే, విజయన్‌  సార్‌ని మన రాష్ట్రానికి మూడోసారి ప్రియతమ నాయకుడిని చేయాలి’’ అని ముందే నాకు ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చారు ఇంటర్వ్యూ దర్శకుడు టీకే రాజీవ్‌. నిజానికి మోదీజీని అక్షయ్‌ ఇంటర్వ్యూ చేయటానికి ఎనిమిదేళ్ల ముందే, కేరళ కాంగ్రెస్‌ లీడర్‌ ఊమెన్‌ చాందీని నేను ఇదే ‘ఇరువర్‌’ పేరుతో ఇంటర్వ్యూ చేయవలసి వచ్చింది. అప్పుడు కూడా అన్నీ మామిడి పండ్ల ప్రశ్నలే! ఇప్పుడు విజయన్‌ ఇంటర్వ్యూలోనూ అవే పండ్లు! ఉదయం మీరు ఎన్ని గంటలకు లేస్తారు? తిరిగి రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటారు? మీ హాబీస్‌ ఏంటి? మీకు ఎవరి సినిమాలంటే ఇష్టం?... ఇలాంటివి!

ఇంటర్వ్యూ మొదలవటానికి ముందు విజయన్‌ను నేను స్క్రిప్ట్‌లో లేని ప్రశ్నొకటి అడిగాను. ‘‘కేరళ ప్రజల కోసం మీరెంతో చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ‘నవ్వని మనిషి’ అయితే మాత్రం ఏమిటి?! అసలీ ఇంటర్వ్యూ అవసరం ఉందా?’’ అని అడిగాను. అప్పుడు నవ్వారు విజయన్‌ ! ఆ నవ్వు మెరుపులా ఉంది!! ‘‘మిస్టర్‌ లాల్‌! నవంబర్‌ 1న ‘కేరళ కంప్లీట్‌ డిజిటల్‌ లిటరసీ’ ప్రోగ్రాంకి మీకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపినా మీరు రాలేదు. ‘దృశ్యం–3’ షూటింగ్‌లో ఉన్నానని చెప్పి తప్పించుకున్నారు! ఇప్పుడు వరుసగా మూడోసారీ కేరళలో మా పార్టీనే రావాలని నేను ఊహిస్తున్న దృశ్యం–3 నిజం కావాలంటే మీలా ఏ పార్టీకీ చెందని స్టార్‌లను, వారి ఫ్యాన్స్‌ని దగ్గర చేసుకోవాలి కదా! అందుకే ఈ ఇంటర్వ్యూ’’ అని మెరుపు ఉరిమినట్లుగా చెప్పారు విజయన్‌ ! ఆ ఉరుములో... నాకు ‘దృశ్యం–4’ కనిపించింది!  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)