Breaking News

అన్నిటికీ తమిళమే అంటే ఎలా?

Published on Thu, 06/05/2025 - 00:38

‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’ అంటూ కమలహాసన్‌ చేసిన కామెంట్‌ను కన్నడ హైకోర్ట్‌ ఖండించింది. ఆ మాటల్ని వెనక్కు తీసుకోమని కూడా సూచించింది. అయితే ఆయన అందుకు నిరాకరించారు. అది ఆయన ఇష్టం. అయితే భాషలపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ‘హిందీ భాష డైపర్లు వేసుకున్న చిన్న పిల్లాడి వంటిది అనీ; హిందీతో పోలిస్తే తమిళ భాషకు చాలా చరిత్ర ఉంద’నీ గతంలో కూడా అన్నారు.

రచయిత్రి రంగనాయకమ్మ అన్నట్లు ‘ఫొనెటిక్స్‌ ప్రకారం గానీ, లింగ్వి స్టిక్స్‌ ప్రకారం గానీ ఒక భాష గొప్పదనీ, ఇంకో భాష తక్కువదనీ ఏమీ ఉండదు. అన్ని భాషలూ సమానమైనవే. ఒక్కో భాష ఒక్కో ప్రాంత అవసరాన్ని తీరుస్తుంది. దేని ఉప యోగం దానికి ఉంటుంది. 

బ్రిటీష్‌ వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించారు కాబట్టి, ఇంగిలీషు ప్రపంచపు భాష అయ్యింది. అదే జర్మనీ వాళ్ళే పరిపాలించి ఉంటే, అప్పుడు జర్మనీ ప్రపంచపు భాష అయ్యి ఉండేది. అంతకు మించి ఇంగిలీషుకి ఏ ప్రత్యేకతా లేదు’.


అలాగే – హిందీ అయినా అంతే! తమిళం అయినా అంతే! తెలుగు అయినా అంతే! కోయవాళ్ళ ‘కోయతూర్‌’ భాషనే తీసుకుంటే... ఆ భాష మాట్లాడే వాళ్లకు దానికి బదులు తమిళం తెచ్చిపెడితే అప్పుడు కోయ వాళ్ళ ‘భాషావసరం’ తీరుతుందా? తమిళానికి ‘ప్రాచీన చరిత్ర’ ఉంది కాబట్టి, ‘తమిళం చాలా గొప్ప భాష’ అని, ఆ కోయవాళ్ళు తమిళాన్ని మెచ్చుకుంటారా? వాళ్ళు మెచ్చు కోలేదు కాబట్టి, తమిళం తన ‘ప్రత్యేక తను’ కోల్పోతుందా? ఇంత చిన్న విషయాలు కూడా కమల్‌ హాసన్‌ లాంటి వాళ్లకు అర్థం కాకో, తెలియకో కాదు. 

ఇలాంటి వివాదాలు వాళ్లకి అవసరం. ప్రజల్లో ‘ప్రేమ’ ఉన్నట్లుగానే ‘ద్వేషం’ కూడా ఉంటుంది. ద్వేషానికి చాలా కోణాలు ఉంటాయి. ‘భాషా ద్వేషం’ అనేది కూడా ఒక కోణమే. సమాజంలో ‘సంస్కృతి’ అనే దానికి దేని ప్రత్యేకతలు దానికి ఉండవచ్చు. కానీ ‘భాష’కు ఉండవు. ఉండ కూడదు. అయినా ప్రత్యేకతలు అనేవి గుర్తించడానికీ, నేర్చుకోడానికీ మాత్రమే ఉండాలి గానీ, ద్వేషించ డానికి కాదు.

తమిళ భాషకూ, తమిళ సాహిత్యానికీ ‘ప్రాచీన చరిత్రే’ ఉండవచ్చు.ఆ మాటను భాషా పరిశోధకులు, చరిత్రకారులు కూడా అన్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అలాగే ఇంకా కొన్ని భాషల్ని కలిపి ‘ద్రావిడ భాషా కుటుంబం’ అని అన్నారు. అంతే తప్ప, ద్రావిడ ప్రాంతా ల్లోని అన్ని భాషలూ ‘తమిళం నుంచి పుట్టాయి’ అని మాత్రం ఎక్కడా ఎవ్వరూ అనలేదు. 

మిడిమిడి జ్ఞానంతో ఏదంటే అది మాట్లాడే వారి తమిళ దురభిమానాన్ని కాసేపు పక్కనబెడదాం. 1816లో ‘ఫ్రాన్సిస్‌ వైట్‌ ఎల్లిస్‌’ మొదటగా కొన్ని దక్షిణభారత (ద్రవిడ) భాషల మధ్య సంబంధం ఉందని కనుగొన్నారు. ఈయన కూడా ‘తమిళం అన్నిటికీ తల్లి భాష’ అని ఎక్కడా అనలేదు. ఈయనే కాదు దక్షిణ భారత దేశ భాషల మధ్య ‘వ్యాకరణ సంబంధాల్ని’ పరిశోధించి ‘ద్రావిడ’ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన (1856) ‘రాబర్ట్‌ కాల్డ్‌వెల్‌’ అనే ఆయన కూడా మన కమలహాసన్‌ లాగా ఏమీ చెప్పలేదు. 

అంతే కాకుండా ‘ద్రావిడ భాషలకీ సంస్కృతానికీ మధ్యన ఎలాంటి జన్యు పరమైన సంబంధం కూడా లేదని’ తేల్చి చెప్పేశాడు. అప్పటికి కొన్ని వందల ఏళ్లగా ‘సంస్కృతం మిగతా అన్ని ద్రావిడ భాషలకూ మూలం’ అంటూ భార తీయ పండితులు అనుకొంటున్న దాన్ని ఈయన కూకటి వేళ్ళతో పెకలించి వేశాడు.

ఈయన తన పరిశోధన కోసం స్కాట్లాండ్‌ను విడిచిపెట్టి వచ్చేశాడు. ముందు ఎల్లిస్‌ ఏడు ద్రావిడ భాషల్ని గుర్తిస్తే... కాల్డ్‌వెల్‌ 12 భాషల్ని గుర్తించాడు. ద్రావిడ భాషల్లోని హల్లుల్ని ‘నాలుక కొసల ద్వారా పలికే విధా నాల్ని’ గుర్తించాడు. వాళ్ళందరూ కూడా తమిళాన్ని ‘పురాతనమైన సాహిత్య భాష’గా మాత్రమే గుర్తించారు. అంతే తప్ప ‘వీటన్నిటికీ మూలం తమిళం’ అని ఎక్కడా చెప్పలేదు. మొదటైతే మను షులుగా పుట్టాం. 

పోనీ పరిణామం చెందాము. ఆ తరువాత సైగలు, శబ్దాలు. మను షులంతా ఒకేచోట పుట్టనట్లుగానే భాషలు కూడా ఒకేసారి, ఒకేచోట పుట్టవు. మనుషుల్లో ఎదుగుదల ఒకే రకంగా లేనట్లుగానే భాషల్లో కూడా ఎదుగుదల ఒకే రకంగా ఉండదు. ఎగుడు దిగుడులు ఉంటాయి. ముందూ వెనకలు ఉంటాయి. అంత మాత్రాన ఒక భాష గొప్పా, ఒకటి తక్కువా అనుకోకూడదు. తమిళం అవసరాన్ని తెలుగు తీర్చదు. 

మలయాళం అవసరాన్ని కన్నడం తీర్చదు. పోనీ వీటన్నిటి అవసరాన్ని హిందీ తీర్చదు. అందరి దాహాన్నీ మంచి నీళ్లు తీర్చినట్లుగా అందరి అవసరాల్నీ ఏ ఒక్క భాషా తీర్చదు. ఆ జ్ఞానం అందరికీ ఉండాలి. ముఖ్యంగా కమలహాసన్‌ వంటి బహుభాషా నటులకు ఎక్కువగా ఉండాలి. అది తెలుసుకొని ఇకనైనా కమలహాసన్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పడం మంచిది.
– నన్నూరి వేణుగోపాల్‌ ‘ మానవహక్కుల కార్యకర్త ‘ 98494 49012 

Videos

రవి కార్తీక్ కు జగన్ అభినందనలు..

జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ అంబటి సెటైర్లు అదుర్స్

చుట్టమల్లే... ఆగలేదా? జూ.ఎన్టీఆర్ పై మళ్లీ...

పడిపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

నామినేషన్ వేయకుండా ఆపుతున్న పోలీసులు

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు