Breaking News

హైదరాబాద్‌కు ఆక్సిజన్‌ ఆగనున్నదా?

Published on Sat, 10/12/2024 - 02:30

దామగుండం... గత పక్షం రోజులుగా తెలంగాణలో ఈ పేరు కలకలం రేపుతోంది. విశ్వనగరం హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రక్షిత అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దేశ రక్షణ శాఖ ఆధ్వర్యంలో భారత నావికాదళానికిసంబంధించి ‘లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్‌ స్టేషన్‌’ను నిర్మించడానికి 2900 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ అటవీభూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ అడవిలో ఇప్పుడు ఈ రాడార్‌ కేంద్రం నిర్మాణానికి 12 లక్షల అద్భుతమైన వృక్షాలను నేలమట్టం చేయబోతున్నారు.

2007లోనే రాడార్‌ స్టేషన్‌ నిర్మాణం కోసం భారత నావికా దళం అధికారులు వచ్చి సర్వే చేసుకొని వెళ్లారు. అయితే అటవీ భూముల బదలాయింపులకు కావలసిన గ్రామ సభలు, పంచా  యతీ తీర్మానాలు వంటి ప్రక్రియలన్నీ గత పదేళ్ల ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని అంటు న్నారు. అయితే పర్యావరణ ప్రేమి కులు వేసిన ప్రజావాజ్యాలతో కోర్టులో స్టే ఉండడంతో భూమి బదలాయింపు మాత్రం జరగలేదు. 

కాగా గత జన వరి 24న రాష్ట్ర ప్రభుత్వం, నావికా దళానికి భూమి బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయడంతో ఇప్పుడు నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకొంటున్నాయి. ఈ విషయాన్ని స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు వెలుగులోకి తేవడంతో మళ్లీ ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవాదులు సంఘ టితం అవుతున్నారు. 

దామగుండం సముద్ర తీరప్రాంతానికి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తులో ఉంది. కాగా ఇంతకంటే దగ్గర, ఇంతకంటే మెరుగైన ప్రాంతాలు సముద్ర తీరప్రాంతానికి దగ్గరగా దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇదే వికారాబాద్‌ జిల్లాలో ఎన్నో ఎకరాల ఖాళీ భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వాలు వీటిని పరిశీలించకుండా ఈ పచ్చని అటవీభూమిని నావికా దళానికి అప్పజెప్పడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.

అటవీప్రాంతాన్ని పెనవేసుకొని ఉన్న 20 గ్రామాలు, దాదాపు 60 వేల మంది ప్రజలు అడవిని కోల్పోతున్నందుకు, పశువులకు మేత భూములు పోతున్నందుకు బాధపడుతున్నారు. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అడవిలో 500 రకాల వైవిధ్యమైన చెట్లు, 150 రకాల ఔషధ వృక్షాలు నేల కూలుతున్నాయి. వీటితో పాటు ఎంతో అరుదైన చుక్కల జింకలు, తోడేళ్లు, ఆసియాలోనే అతిపెద్ద జింక అయిన నీల్‌ గాయ్, అడవిపందులు, పెద్ద కొమ్ముల సాంబార్‌ జింకలు, చింకారా జాతిజింకల వంటి జంతువులతో పాటు వేల రకాల పక్షులు తమ ఆవాసాన్ని కోల్పోతున్నాయి. 

దీనితో పాటు ఈ రాడార్‌ స్టేషన్‌ వలన వెలువడే రేడియేషన్‌ ప్రభావంతో చుట్టుప్రక్కల ప్రజలకు కంటి చూపు సమస్యలు, సొమాటిక్‌ లక్షణాలు, ఆందోళన, నిద్ర లేమి, మానసిక రుగ్మతలు, సంతానలేమి, వంధత్వం, చర్మ సమస్యలు, అవయవాల పనితీరుపై ప్రభావం, ఎలక్ట్రికల్‌ షాక్‌ వంటి సమ స్యలు పొంచివున్నాయి. 

దామగుండం అడవిని ఆనుకునే ఉన్న వికారాబాద్‌ అనంతగిరి అడవులే మూసీ నదికి జన్మస్థలం. ఈ నది ఇక్కడి నుంచే మొదలై విశ్వనగరం హైదరాబాద్‌ మీదుగా దాదాపు 240 కిలోమీటర్లు ప్రవహించి, నల్లగొండ జిల్లా వజీరాబాద్‌ సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. ఈ రాడార్‌ స్టేషన్‌ నిర్మాణం వల్ల మూసీ నదీ పరివాహక ప్రాంతానికి, ఆ నదితో పాటు పుట్టిన ఈసా, కాగ్నా నదుల అస్తిత్వం కూడా ప్రమాదంలో పడింది.

ఈ దామగుండం అటవీప్రాంతం విశ్వనగరం హైదరాబాద్‌కు కేవలం 75 కిలోమీటర్ల దూరంలోఉంది. రాజధాని నగరానికి ప్రధాన ఆక్సిజన్‌ వనరులు కూడా ఇక్కడ విస్తరించి ఉన్న అడవులే. ఇప్పుడు 2,900 ఎకరాలలో పచ్చదనం కోల్పోవడం అంటే విశ్వనగరానికి ఆక్సిజన్‌ సిలిండర్‌ తీసివేస్తున్నట్లే! 

ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో సమగ్ర పరి జ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలను, ఆ యా పంచాయతీ పెద్దలను గ్రామ సభలు, తీర్మా నాల పేరుతో తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే మోసం చేస్తుంటే వారు ఎవరికి చెప్పుకోగలరు? ఇప్పుడీ దామగుండం పరిరక్షణ పర్యావరణ బాధ్యత స్థానిక ప్రజలే తేల్చుకోవాలి. వారికి సరియైన దిశానిర్దేశం చేయా ల్సిన బాధ్యత పర్యావరణ పరిరక్షకులు, ప్రజాస్వామ్యవాదులపై ఎంతైనా ఉంది.

– మోతె రవికాంత్‌ ‘ సేఫ్‌ ఎర్త్‌ ఫౌండేషన్‌ అధ్యక్షులు 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)