Breaking News

సంతాపం.. సగం చేటు!

Published on Fri, 06/21/2024 - 15:59

పుట్టెడు కష్టం వచ్చి శోకసంతాపాల్లో మునిగి ఉన్న వ్యక్తిని, ‘ఊరుకో, దుఃఖించకు!’ అంటే ఊరుకోడు. ఊరుకోలేడు. అనుకోకుండా తీవ్రమైన కష్టాలు ఎదురయినప్పడు మనిషికి సంతాపం, దిగులు, దుఃఖం కలగటం మామూలు విషయమే. కొన్ని పరిమితులలో ఉన్నవరకూ అది మానసిక ఆరోగ్యానికి మంచిది కూడా!

అయితే ఘడియకో, గంటకో, రోజుకో, వారానికో ఎలాగోలా దాన్ని అధిగమించాలి. బాధే సౌఖ్యమనే భావన పట్టుకొని, శోకపు ఊబి నుంచి బయటపడే ప్రయాస చేయని దేవదాసు మనసు మీదా, జీవితం మీదా అదుపు కోల్పోయి మరింత శోకం కొని తెచ్చుకొన్నవాడయ్యాడు. సఫల జీవనం కోరేవాడికి సంతోషం సగం బలం. సంతాపం సగం చేటు.

సందర్భానికి సరిపడని నవ్వులాగా, దీర్ఘకాలం కొనసాగే సంతాపం కూడా నాలుగందాల చేటు అంటుంది మహాభారతం. ‘సంతాపాత్‌ భ్రశ్యతే రూపం, సంతాపాత్‌ భ్రశ్యతే బలమ్‌’... దీర్ఘ శోకం వల్ల శరీరం చిక్కి, ముఖం నిస్తేజమై, ఆకారం వికారమవుతుంది. సంతాపం వల్ల బలం– అటు మనోబలమూ, ఇటు శరీర బలమూ– క్షీణించటం జరుగుతుంది. ‘సంతాపాత్‌ భ్రశ్యతే జ్ఞానం, సంతాపాత్‌ వ్యాధిం బుచ్ఛతి’... దుఃఖం వల్ల వివేచనా, జ్ఞానమూ సన్నగిల్లుతాయి. మితిమీరిన సంతాపం అనారోగ్యాన్ని కలిగిస్తుంది.

శోకించటం వల్ల, కోల్పోయింది తిరిగిరాదు. తిరిగి రావాలంటే కావాల్సింది ప్రయాస. ఆ ప్రయాసకు శోకం ప్రతిబంధకం. శోకం వల్ల, శోకించేవాడికి లాభం శూన్యం. అతడి శత్రువులకు మాత్రం అతడి శోకం ఆనందాన్నిస్తుంది అంటాడు విదురుడు. – ఎం. మారుతి శాస్త్రి

ఇవి చదవండి: సంగీతానికి ఆ శక్తి ఉందా?

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు