Breaking News

భారతీయతకు ప్రతీక స్వదేశీ క్రైస్తవం

Published on Fri, 07/03/2026 - 12:16

భిన్న సంస్కృతులు, మతాలు, భాషలు, తత్వాలు కలిసిమెలిసి వికసించినదే భారతీయత. సముద్ర వాణిజ్య మార్గాల ద్వారా ప్రపంచంతో ఏర్పడిన సంబంధాలు భారతీయ సంస్కృతిని మరింత సుసంపన్నం చేశాయి. ఈ చారిత్రక నేపథ్యంలోనే భారతీయ క్రైస్తవ సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలి.

క్రైస్తవ విశ్వాసం భారతదేశానికి వలస పాలనతో వచ్చిందనే అభిప్రాయం చారిత్రకంగా సత్యం కాదు. క్రైస్తవ సంప్రదాయం ప్రకార, అపొస్తలుడైన ‘తోమా’ క్రీ.శ. 52లో మలబార్‌ తీరానికి చేరుకుని సువార్త ప్రకటించగా, క్రీ.శ. 72లో మైలాపూర్‌లో హతసాక్షిగా మరణించాడు. ఇది దేశంలో క్రైస్తవ వార సత్వానికి దాదాపు రెండువేల ఏళ్ళ చరిత్రను సూచిస్తుంది. ఈ చారిత్రక వార సత్వాన్ని గుర్తు చేస్తూ, 2021లో వివిధ క్రైస్తవ సంప్రదాయాలకు చెందిన నాయకులు కలిసి జూలై 3ను భారతీయ క్రైస్తవ దినోత్సవంగా ప్రకటించారు. ఇది ఏ ఒక్క చర్చికి చెందిన మతపరమైన పండుగ కాదు; భారత్‌లో క్రైస్తవుల ఉనికి, సేవా వారసత్వం, భారతీయ సంస్కృతితో వారి అనుబంధాన్ని స్మరించుకునే జాతీయ సందర్భం. ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో దీనిని ‘యేసు భక్తి దివస్‌’ అని కూడా వ్యవహరిస్తారు. భార తీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలోని ‘భక్తి’ తత్త్వాన్ని ప్రతిబింబించే పేరుగా ఇది ప్రాచు ర్యంలోకి వచ్చింది.

భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ సమాజం అందించిన సేవలు విశేషమైనవి. క్రైస్తవ విద్యా సంస్థలు లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, సేవాభావాన్ని అందించాయి. అనేక ఆసు పత్రులు నిర్మించాయి. మహమ్మారులు తలెత్తినప్పుడు కుల మత భేదాలకు అతీతంగా ఆదుకొన్నాయి. సామాజిక సేవ క్రైస్తవ విశ్వాసంలో అంతర్భాగం. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వికలాంగుల పునరావాస కేంద్రాలు, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ కార్య క్రమాల ద్వారా అనేక సంస్థలు సమాజాభివృద్ధికి విశేషంగా దోహదపడ్డాయి.

తెలుగు భాషాభివృద్ధిలో కూడా క్రైస్తవ పండితుల పాత్ర ప్రస్తావనీయ మైనది. నిఘంటువులు, వ్యాకరణ గ్రంథాలు, బైబిల్‌ అనువాదాలు, ముద్రణా సాంకేతికత ద్వారా తెలుగు గద్యాభివృద్ధికి వారు విశేష కృషి చేశారు. భారతదేశ బలం దాని వైవిధ్యంలో ఉంది. ఆ వైవిధ్యానికి భారతీయ క్రైస్తవ సంప్రదాయం కూడా రెండువేల సంవత్సరాలుగా తనదైన ముద్ర వేసింది. – డా. శామ్యూల్‌ జాన్‌ ఆదూరి (నేడు భారతీయ క్రైస్తవ దినోత్సవం)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)