Breaking News

లోకం పచ్చగా ఉండాలంటే..!?

Published on Thu, 06/27/2024 - 12:05

సమాజం ఎంత ఆధునికంగా మారితే ప్రకృతి అంత తీవ్రంగా ధ్వంసం మవుతున్నదనేది చరిత్ర చెబుతున్న పాఠం. అడవులను విచక్షణారహితంగా నరకడం, తిరిగి చెట్లను నాటాలనే బాధ్యతను విస్మరించడం, అవసరానికి మించి ప్లాస్టిక్‌ను వాడటం, కర్బన ఉద్గారాలను తగ్గించలేకపోవటం వంటి వివిధ కారణాల వల్ల  పర్యావరణం కలుషితమయ్యి నేడు సమస్త మానవాళిపై కన్నెర్ర చేస్తోంది. దీంతో మానవ మనుగడే ప్రశ్నార్థకమయ్యింది.

నేడు త్రాగడానికి మంచినీరు, శ్వాసించడానికి ఆక్సిజన్‌ దొరకని ఆందోళనకర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది మనం గర్వంగా చెప్పుకునే 5జీ ప్రపంచం. మనమంతా ఈ అవనిపై అతిథులం అనే  సత్యాన్ని  చాలామంది గ్రహించలేపోతున్నారు. భవిష్యత్‌ తరాలకు బతుకునీయాలంటే, బతుకు ఉండాలంటే ప్రపంచ దేశాలు సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రకృతితో స్నేహం చేయాలి. పచ్చదనాన్ని పరిమళించేలా చేయాలి.

మనం నాటే చెట్ల ఎదుగుదలే మానవ నాగరికత ప్రగతిగా భావించాలి. చెట్లను నాటినట్లు నటించడం మానేయాలి. ప్లాస్టిక్‌ వినియోగాన్ని బాగా తగ్గించాలి. జల వనరులను సంరక్షించాలి. అడవులను కాపాడుకోవాలి. సౌర విద్యుత్‌ వినియోగం పెంచాలి. వాయు కాలుష్యం తగ్గించాలి. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెంచాలి. ఓజోన్‌ పొరను కాపాడాలి.

సాంకేతికంగా ఎదుగుతూనే పర్యావరణ పరిరక్షణపై ప్రపంచదేశాలు కలిసి పనిచేయాలి. భావి పౌరులైన విద్యార్థులకు మొక్కల పెంపకం, ప్లాస్టిక్‌ నిషేధం వంటి అంశాలపై అవగాహనా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి. ప్రకృతి ప్రాణంతో ఉంటేనే మనమంతా జీవంతో ఉంటాము. లేదంటే ప్రకృతి ప్రదర్శించే విధ్వంసాన్ని ఆపడం అసాధ్యం. ‘ప్రకృతి మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది, మన అంతులేని కోరికలను కాద’ని ఏనాడో గాంధీజీ అన్నారు. కాబట్టి మనిషి ప్రకృతిని దురాశతో కొల్లగొట్టి ధ్వంసం చేయకుండా అవసరం మేరకే దానిపై ఆధారపడాలి. అప్పుడు లోకం పచ్చగా ఉంటుంది. – ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్, నాగర్‌ కర్నూల్‌

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)