జనాల దృష్టి మళ్లించేందుకే బనకచర్ల!

Published on Sat, 06/28/2025 - 09:49

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాగునీటి రంగ విధానాలు రైతాంగ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏపీలో జల వన రులు పుష్కలంగా ఉన్నా వాటిని వ్యవసాయానికి మళ్లించడంలో పాలకులు విఫలమయ్యారు. ఫలితంగా సాగు నీటి సమస్య కొనసాగుతూ వస్తున్నది. రైతుల ఆందోళన ఫలితంగా సాగు, తాగు నీరు కోసమంటూ కొన్ని నీటి పథకాలు చేపట్టి దశాబ్దాలు గడిచినా అవి ఇంకా పూర్తి కాలేదు. ఫలితంగా రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, విజయనగరం జిల్లా లలో కొన్ని ప్రాంతాలు కరవు పీడిత ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి. పాలకుల విధానాల పట్ల రైతాంగంలో వ్యతిరేకత వ్యక్తమైన ప్రతి సందర్భంలో కొత్త సాగు నీటి పథకాలను ముందుకు తెస్తున్నారు. 

అందులో భాగమే కొత్తగా తెర మీదకు వచ్చిన పోల వరం – బనకచర్ల ఎత్తిపోతల లింక్‌ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు ప్రాతాలకు సాగు నీరు, తాగు నీరు అందించటం లక్ష్యమని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం తాజాగా ‘జల హారతి కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ అనే సంస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అమరావతి కేంద్రంగా పనిచేస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించటానికి మోదీ ప్రభుత్వంతో రాజీపడిన చంద్రబాబు ప్రభుత్వంపై రైతాంగంతో పాటు రాష్ట్ర ప్రజలందరిలో తీవ్ర వ్యతి రేకత ఏర్పడింది. 

దీని నుంచి ప్రజలను పక్క దారి పట్టించడానికి అకస్మాత్తుగా ముందుకు తెచ్చిందే ఈ పోలవరం–బనకచర్ల లింక్‌ ప్రాజెక్ట్‌. శ్రీశైలం కుడి కాల్వ ప్రాజెక్టులో భాగమైన బనక చర్ల రెగ్యులేటర్‌ ఉన్న ప్రదేశమే కడప జిల్లా జమ్మల మడుగులో ఉన్న బనకచర్ల. ఈ ప్రాజెక్టు అనుసంధా నానికి రూ. 81,900 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఈ అనుసంధానం ద్వారా 12.4 లక్షల హెక్టార్ల భూమికి సాగు నీరు, 400 వందల కిలోమీటర్ల పొడవునా ఉన్న గ్రామాలకు తాగు నీరు, 340 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధ్యమని  కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కోసం 54 వేల ఎకరాల భూమి అవసరమని పేర్కొంది. 

ఈ ప్రాజెక్టును నీటిపారుదల అధికారులు మూడు దశలుగా విభజించారు. మొదటి దశలో పోలవరం నుండి తాడిపూడి వరద కాలువ ద్వారా 175 కిలోమీటర్ల వరకు 18 వేల క్యూసెక్కుల డిశ్చార్జ్‌తో ప్రకాశం బ్యారేజ్‌కు నీటిని విడుదల చేస్తారు. రెండవ దశలో ప్రకాశం బ్యారేజ్‌ నుండి బొల్లాపల్లి రిజర్వాయర్‌ వరకు 23 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. మూడవ దశలో బొల్లాపల్లి రిజర్వాయర్‌ నుండి బనకచర్ల రెగ్యులేటర్‌కు 23 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. మూడో దశ చాలా క్లిష్టమైనదిగా సాగు నీటి రంగ నిపుణులు చెబు తున్నారు. నల్లమల పులుల అభయారణ్యంలో 34 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాలి. 2005లో ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టు రెండు సొరంగాల తవ్వకం పనులు నత్తనడకన నడుస్తూ ఇప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. 

పోలవరం ప్రాజెక్టు ఎత్తును మోదీ ప్రభుత్వం తగ్గించింది. ఫలితంగా 119.4 టీఎమ్‌సీల నీరు మాత్రమే నిల్వ సాధ్యం. కుడి కాల్వ కింద మూడు లక్షల ఎకరాలకు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎక రాలకు కూడా ఈ నీరు సరిపోదనీ, అలాంటప్పుడు బనకచర్లకు నీటిని తరలించటం ఎలా సాధ్యమనీ సాగునీటి నిపుణులు అంటున్నారు. ప్రస్తుతంరాష్ట్రంలో వెలుగొండ, వంశధార రెండవ దశ, వంశధార – నాగావళి అనుసంధానం, మహేంద్ర తనయ, గజపతి నగరం బ్రాంచి కాల్వ వంటి 59 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటికి కొద్దిపాటి నిధులు విడుదల చేస్తే నిర్మాణాలు పూర్తయ్యి రైతుల కష్టాలు తీరతాయి. 

బనకచర్ల ప్రాజెక్టును వరద నీటిని ఉపయోగిం చుకోవటానికి నిర్మిస్తున్నామని చంద్రబాబు అంటు న్నారు. కానీ, వరద నీరు లభ్యత భారీ వర్షాలపై ఆధారపడి ఉంటుంది. వరదలు రాకపోతే నీరు లభించదు. అటువంటి ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఖర్చు చేయటం ఏ మాత్రం సరైన విధానం కాదు. భారీ ఖర్చుతో కూడిన బనకచర్ల ఆలోచన మాని, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేసి, నిర్మాణంలో ఉన్న మిగిలిన ప్రాజె క్టులను కూడా పూర్తి చేసి... సాగు, తాగునీరు అందించాలని యావ న్మంది రైతాంగం, ప్రజలు ఉద్యమించాలి. 
వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.)
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526 

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)