Breaking News

Ravipudi Venkatadri: వంద వసంతాల హేతువాది

Published on Wed, 02/09/2022 - 11:40

హేతువాద ఉద్యమానికి తెలుగునాట ప్రాచుర్య ప్రాశస్త్యాలను తీసుకువచ్చినవారు రావిపూడి వేంకటాద్రి. ఆయన నేడు 100 వసంతాలను పూర్తిచేసుకుని 101వ ఏట అడుగుపెడుతున్నారు. ఇది వ్యక్తిగతంగా ఆయనకూ, ఉద్యమపరంగా సమాజానికీ ఒక చారిత్రక ఘట్టం.

1922 ఫిబ్రవరి 9న ప్రకాశం జిల్లా నాగండ్లలో జన్మించిన వేంకటాద్రి 1943లో తన 21వ ఏటనే స్వగ్రామంలో ‘కవిరాజాశ్రమం’ స్థాపించారు. అంత చిన్నవయసులోనే సామాజిక, హేతువాద ఉద్యమాల ప్రముఖనేతలను తమ గ్రామానికి ఆహ్వానించి, ఉపన్యాసాలు ఇప్పించి, ప్రజల్లో చైతన్యబీజాలు నాటారంటే రావిపూడి శక్తిని అంచనా వేసుకోవచ్చు. అంతేకాదు. తన అభిమానకవి, ప్రముఖ హేతువాది త్రిపురనేని రామస్వామి పేర ‘కవిరాజు ట్యుటోరియల్స్‌’ స్థాపించి, మిత్రులతో కలిసి యువతలో శాస్త్రీయమైన ఆలోచనలను పెంచిన ఘనత కూడా వీరికే దక్కుతుంది. హేతువాద, మానవవాద, నాస్తికవాదాల గురించి 100కు పైగా ప్రామాణిక రచనలు చేశారు.

ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళటానికి పత్రిక అవసరం గుర్తించి ‘హేతువాది’ మాసపత్రికను స్థాపించారు. నాటి నుండి నేటి వరకు నలభై ఏళ్లుగా సంపాదకులుగా వ్యవహరిస్తూ పత్రికను నిరాటంకంగా నడుపుతున్నారు. 76 ఏళ్ల క్రితం 1946లో ‘విశ్వాన్వేషణ’తో రచనా ప్రస్థానం ప్రారంభించి ఫిబ్రవరి 9, 2022న ఆవిష్కరిస్తున్న ‘లోకాయత చార్వాకం’తో 109 రచనలు చేసిన శతాధిక గ్రంథకర్తగా సరికొత్త రికార్డును సృష్టించారు వందేళ్ల రావిపూడి. (Bharat Bhushan: ఆదర్శ జీవితానికి కొలమానం)

తెలుగునాట వందలమందిని శిష్యులుగా, ఉద్యమాభిమానులుగా తీర్చిదిద్దారు. హేతువాదులు సమాజహిత వాదులని నిరూపించారు. మానవతావాదం కంటే మానవవాదం ముఖ్యమనే సరికొత్త భావజా లాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. మూక ఉద్యమాలు, మూస ఉద్యమాలు ప్రజల్లో మాస్‌ హిస్టీరియాను పెంచుతాయనీ, హేతువాద, మానవవాదాలు ప్రజలను ఆలోచనా మార్గంలో నడుపుతాయనీ అంటారు రావిపూడి. మాస్టారును పద్మశ్రీలు వరించక పోవచ్చు. ఆయనకు గౌరవ డాక్టరేట్లు రాకపోవచ్చు. కానీ వందేళ్ల ఆయన అలుపెరుగని జీవితం సమాజానికి తరగని ఆస్తి. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిదీ! (Bhimsen Joshi: శతవసంత స్వరమాధురి)

– బీరం సుందరరావు
హేతువాద ఉద్యమ నాయకులు
(నేడు రావిపూడి వేంకటాద్రి 101వ జన్మదినోత్సవం)

Videos

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

రాసుకో చంద్రబాబు.. ఒకే ఒక్కడు వైఎస్ జగన్

మీర్ చౌక్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా

ఏపీ పోలీసు వ్యవస్థ మొత్తం చంద్రబాబు గుప్పిట్లో బందీ అయిపోయింది

Photos

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)

+5

చిరుకు జోడీగా నయన్.. ఫస్ట్ టైమ్ ఇలా (ఫొటోలు)

+5

Miss World 2025 : రామోజీఫిల్మ్‌ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)

+5

#MissWorld2025 : పిల్లలమర్రిలో అందగత్తెల సందడి (ఫొటోలు)

+5

ముంబై వాంఖడేలో రో‘హిట్‌’ శర్మ స్టాండ్‌.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)