Breaking News

రాజుగారి పీచుమామిడి.. కోటలోనే లభ్యం

Published on Thu, 05/15/2025 - 11:58

వేసవి అంటే మామిడిపళ్ళ సీజన్..  నూజివీడు రసాలు.. బంగినపల్లి.. చిత్తూరు మామిడి.. కొబ్బరంటు.... చేరుకురసాలు.. సువర్ణ రేఖ.. ఇలా ఎన్నో రకాలు మననోరూరిస్తుంటాయి. ఒక్కో రకానికి ఒక్కో ఫ్లేవర్.. ఒక్కో రుచి ఒక్కో ప్రాంతానికి ఒక్కో మామిడి రకాలతో అనుబంధం.. వాటి పేరుతోనే ఆ ప్రాంతానికి సైతం ఒక గుర్తింపు.. ప్రాచుర్యం కూడా వస్తుంది.. అలాగే విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాజుల సంస్థానానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన మామిడి రకం ఉంది.. అది ఆ సంస్థానం వారి సొంత బ్రాండ్. వారి పెరట్లోనే కాస్తాయి.. వారి తోటల్లోనే కాస్తాయి.. వారు ఇస్తేనే తినాలి.. బయట ఎక్కడా దొరకదు.

వాస్తవానికి ఈ బొబ్బిలి .. మెట్టవలస అనేది బొబ్బిలి సంస్థానం పాలకుల సొంత బ్రాండ్. అది ఆ వీరబొబ్బిలి కోట పరిసరాల్లో తప్ప ఇంకెక్కడా పండేది కాదు, ఆ మొక్కలు ఇంకెక్కడా లేవు కూడా. దీంతో ఆ మామిడి పళ్ళను బొబ్బిలి రాజులు తమ ఆంతరంగికులు, ఆత్మీయులు, అభిమానులకు కానుకగా ఆ పళ్ళను పంపేవారు.  ఏటా రాజుల చేతులమీదుగా పళ్ళను శ్వీకరించడాన్ని ఆనందంగాను, గౌరవంగాను భావించేవారు. అందుకే ఆ పళ్ళ ప్రాశస్త్యాన్ని, బ్రాండ్ వాల్యూను గుర్తించడంతోబాటు రాజుల పట్ల అమితమైన ప్రేమ, గౌరవం కలిగిన వారంతా ఆ పళ్ళను తినేసి మళ్ళీ ఆ టెంకలను కోట పరిసరాల్లో పడేసేవారట. దీంతో ఆ పళ్ళు వేరే ఎక్కడ ఆభ్యమయ్యేవికాదన్నమాట. 

మొత్తానికి కొన్ని దశాబ్దాల తరువాత  బొబ్బిలి సంస్థనాధీశులు  తమకు ఆత్మీయులైన కొందరు రైతులకు ఆ మొక్కలు  ఇవ్వడంతోబాటు మొక్కలకు అంట్లు కట్టడం నేర్పించి  ఆ మామిడి పలుచోట్ల కాసేలా, పళ్లు అందరికి లభ్యమయ్యేలా ప్రోత్సహించారు. దీంతో ఆ బ్రాండ్ కాస్తా బయటి సమాజంలోకి వచ్చింది. ఇప్పుడు పలుచోట్ల ఆ పీచుమామిడి చెట్లు మధురఫలాలను ఇస్తున్నాయి. ఏదేమైనప్పటికి ఇప్పటికి మెట్టవలస పీచు రసాలు అంటే బొబ్బిలి రాజుల బ్రాండ్ అనేది ఫిక్స్ అయిపోయింది. 

నన్ను గుర్తుంచుకుని నాకోసం బుట్టెడు పళ్ళను కానుకగా పంపిన మా అన్నగారు బేబీ నాయిన గారికి ధన్యవాదాలు.  రుచిలోను, మధుర్యంలోను దేశంలోని వేరే ఏ గొప్ప మామిడి బ్రాండ్ కు తీసిపోనివి ఈ బొబ్బిలి మెట్టవలస రసాలు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. బంగినపల్లి, సువర్ణ రేఖ మాదిరిగా కాకుండా ఈ పీచుమామిడి టెంకకు పీచు అధికంగా ఉంటుంది. రసాన్ని పీల్చేకొద్దీ ఊరుతూనే ఉంటుంది. అందుకే ఎన్ని తిన్నా ఇంకోటి..ఇంకోటి అనేలా ఉంటాయి..

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)