Breaking News

యాచకురాలి బిడ్డను బడిలో చేర్పించిన ఉపాధ్యాయుడు

Published on Sat, 07/05/2025 - 19:33

మణుగూరు టౌన్‌: ఓ యాచకుడు అడుక్కుంటూ వచ్చే ఆదాయంతోనే భార్యాబిడ్డను పోషించేవాడు.. ఆయన మృతితో భార్య కుటుంబ పెద్దగా యాచననే ఎంచుకుంది. ఈక్రమంలోనే బిడ్డను కూడా వెంట తీసుకెళ్తుండటం గమనించిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆమెకు నచ్చజెప్పారు. ఆ బిడ్డను బడిలో చేర్పించి స్థానికుల మన్ననలు అందుకున్నారు.

మణుగూరు మున్సి పాలిటీ కార్యాలయానికి సమీపాన రహదారి వెంట ఉంటున్న ధన.. తన బిడ్డ యేసుమణిని సైతం యాచనకు తీసుకెళ్తోంది. గతనెలలో నిర్వహించిన బడిబాటలో మండలంలోని శివలింగాపురం పాఠశాల ఉపాధ్యాయుడు మాలోతు భద్రు తదితరులు ధనకు అవగాహన కల్పించగా పాఠశాలలో చేర్పించింది. ఒకటి, రెండు రోజులు యేసుమణి పాఠశాలకు వచ్చినా.. ఆ తర్వాత నుంచి రావడం లేదు.

ఈ నేపథ్యంలో, శుక్రవారం భద్రు తల్లిబిడ్డను రోడ్డు పక్కన గుర్తించాడు. దీంతో యేసుమణిని పాఠశాలకు పంపించాలని కోరారు. పుస్తకాలు, పెన్నులు కొనడం తనవల్ల కాదని ధన బదులిచ్చింది. ఈమేరకు పాఠశాల నుంచి యూనిఫాం తెప్పించిన ఉపాధ్యాయుడు యేసుమణికి వేయించి.. షాప్‌కు తీసుకెళ్లి బ్యాగ్, ఇతర సామగ్రి కొనిచ్చారు. అనంతరం తన బైక్‌పైనే పాఠశాలకు తీసుకెళ్లారు. రోజూ విద్యార్థిని పాఠశాలకు పంపించేలా పర్యవేక్షిస్తానని కూడా స్పష్టం చేసిన ఉపాధ్యాయుడు భద్రును స్థానికులు అభినందించారు.

చ‌ద‌వండి: 20 మంది విద్యార్థులుంటే కొత్తగా స్కూల్‌  

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి