ఇంటి కోసం పెద్దగా కష్టపడలేదు.. సింపుల్‌గా బస్సులోనే బస!

Published on Sun, 04/02/2023 - 12:41

ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టమో తెలిసిందే. చేతిలో లక్షలు ఉంటే గాని, ఇల్లు కట్టడం సాధ్యం కాదు. ఇక పట్టణాల్లో ఇల్లు కొనాలనే ఆలోచన కూడా సామాన్యులు చేయలేరు. అయితే, ఇంగ్లాండ్‌కు చెందిన కాన్రాడ్‌ క్రిక్, ఇంటి కోసం పెద్దగా కష్టపడలేదు. ఒక పాత బస్సునే తన ఇల్లుగా మార్చి అందరినీ ఆశ్చర్యపరచాడు. లగ్జరీ ఫ్లాట్‌కు ఏమాత్రం తీసిపోని ఈ డబుల్‌ డెక్కర్‌ బస్సులో ఒక కిచెన్, హాలుతోపాటు మూడు బెడ్‌రూమ్‌లు, రెండు బాత్‌రూములు ఉన్నాయి.

అతని భార్య నికోల్‌ మిక్‌కార్తీతో పాటు వారి నలుగురు పిల్లలు, రెండు పెంపుడు పిల్లులు, రెండు కుక్కలు కలసి ఈ బస్సులో నివాసం ఉంటున్నారు. వీరంతా వారి సొంతింటి కల కోసం రీసైకిలింగ్‌ వస్తువులనే వాడుతూ చాలా పొదుపుగా జీవిస్తున్నారు. ఇక పిల్లల స్కూల్‌ ఫీజు, బిల్లులు, ఇతర ఖర్చులు అన్నీ కలసి వీరి నెల ఖర్చు వెయ్యి పౌండ్లు (సుమారు రూ.98 వేలు). ఇంగ్లండ్‌లో ఇది చాలా తక్కువ. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ బస్సు ఇంటిని.. క్రిక్, యూట్యూబ్‌ వీడియోలు చూసి చేశాడట. త్వరలోనే ఓ అందమైన నిజమైన ఇంటిని నిర్మించుకుంటామని ఈ కుటుంబం అంటున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)