Breaking News

గుంటూరు కారం కథ తెలుసా అసలు.?

Published on Sat, 06/10/2023 - 16:10

బంగాళాదుంప , మొక్క జొన్న , వేరుశెనగ , పైన్ ఆపిల్ , నారింజ , పొగాకు ,  బాదం , బెండకాయ , సపోటా , బొప్పాయి , మిరపకాయ , జీడిపప్పు,    .. ఇవి లేని జీవితాన్ని ఊహించండి ! 

అంటే … మసాలా దోస , మిర్చి బజ్జి , వేరుశనిగ చట్నీ , బెండకాయ పులుసు , జీడీ పప్పు ఉప్మా … ఇవన్నీ ఉండవన్న మాటే కదా !

“ అహో ఆంధ్ర భోజా ! .. శ్రీకృష్ణ దేవా రాయా ! శిలలపై శిల్పాలు చెక్కించావు .. కానీ గుంటూరు కారం రుచి చూడలేదు .. ఉడిపి మసాలా దోస రుచి తెలియదు.  ఏంటి ప్రభు? అని టైం మెషిన్ లో వెనక్కు వెళ్లి అడిగితే .."  నేనేమి చేసేది మా కాలానికి ఈ పంటలు లేవు అంటాడు.

ఎందుకంటే ఈ పంటలను , అటు పై పోర్చుగీస్ వారు, లాటినా అమెరికా దేశాలనుంచి సేకరించి మన దేశంలో ప్రవేశపెట్టారు.

మరి ఆ రోజుల్లో మనాళ్ళు మసాలా దినుసులుగా ఏమి వాడేవారు?

అల్లం , పసుపు , ఆవాలు , దాల్చిన చెక్క , ఏలకులు , లవంగాలు,  ధనియాలు,  ఇంగువ  , మెంతులు ... ఇవన్నీ మన పంటలే . వీటిని మసాలా దినుసులుగా వాడేవారు ! 

అదండీ గుంటూరు కారం కథ !  కేవలం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర .

నల్ల మిరియాలు అనాదిగా ఇండియా లో పండించేవారు. దాన్ని పోర్చుగీస్ వారు ఎగుమతి చేసుకున్నారు.

ఇప్పుడు రాజ్యమేలుతున్న ఎన్నో వంటకాలు మనవి కాదు, కానీ తొందరగానే మన జీవితాలను పెనవేసుకుపోయాయి.

మార్పు సహజం .. కానీ కొత్తొక వింత కాదు . పాతొక రోత కాదు. ఏది మంచి ? ఏది చెడు అని- నా  వక్తిగత అభిప్రాయం కాకుండా సామజిక శాస్త్రం - మానవ శాస్త్రం - జీవ శాస్త్రం కోణం నుంచి శాస్త్రీయ విశ్లేషణలు చేస్తున్నా.

వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక శాస్త్ర విశ్లేషకులు, ప్రముఖ విద్యావేత్త

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)