Breaking News

Mulberry మల్బరీ జ్యూస్‌ : ఆరోగ్య ప్రయోజనాలు

Published on Sat, 04/19/2025 - 12:49

తియ్య తియ్యగా... పుల్ల పుల్లగా ఉండే మల్బరీ పండ్లు అన్ని కాలాలలోనూ అందుబాటులో ఉంటాయి. మల్బరీ పండ్లతో చేసిన జ్యూస్‌ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అవేమిటో చూద్దాం..

మల్బరీతో ఆరోగ్య ప్రయోజనాలు
మల్బరీలో ఉండే డైటరీ ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం, కడుపులో మంటలను తగ్గిస్తుంది.  గుండె ఆరోగ్యానికి మల్బరీ యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలను కలిగి ఉండి రక్తనాళాల పనితీరును మెరుగుపరచి రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. తద్వారా స్ట్రోక్స్, గుండెపోటు వంటి సమస్యలను నివారిస్తుంది.

ఇదీ చదవండి: ప్రియుడితో మాజీ సీఎం కుమార్తె పెళ్లి : వైభవంగా

రోగనిరోధక శక్తి పెంపు: మల్బరీ లో విటమిన్‌ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యాధులకు వ్యతిరేకంగా శక్తిమంతమైన రక్షణను అందిస్తుంది.
ఎముకల ఆరోగ్యానికి: మల్బరీలోని విటమిన్‌ కె, కాల్షియం, ఐరన్‌ వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి మంచిది.

కంటి చూపు మెరుగు: మల్బరీ జ్యూస్‌లో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది తాగడం వల్ల చూపు మెరుగుపడుతుంది. కంప్యూటర్‌ ముందు గంటల తరబడి పనిచేసే వారికి కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.

వేగంగా కోలుకోవడానికి తోడ్పడుతుంది: శస్త్రచికిత్స తర్వాత రోగులకు మల్బరీ జ్యూస్‌ చాలా ఉపయోగ కరంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తుంది. 

జుట్టు సహజ రంగును నిలుపుకుంటుంది: మల్బరీ జుట్టులో మెలనిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది జుట్టు సహజ రంగును నిలుపుకోవడానికి సహాయ పడుతుంది, జుట్టు నెరిసిపోవడాన్ని తగ్గిస్తుంది.

చదవండి: ఇషా అంబానీ డైమండ్‌ థీమ్డ్‌ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్‌ లెవల్‌ అంతే!

మెదడు ఆరోగ్యానికి మంచిది: మల్బరీలో న్యూరో ప్రొటెక్టివ్‌ లక్షణాలను కలిగి ఉన్న వివిధ బయో యాక్టివ్‌ సమ్మేళనాలు మెదడు కణాలను ఒత్తిడి నుంచి రక్షించి ఐక్యూను మెరుగుపరుస్తాయి. మల్బరీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి, నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. 
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

నోట్‌ : చివరగా... ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఈ జ్యూస్‌ని విపరీతంగా తాగ కూడదు. పరిమితి  పాటించడం మంచిది. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)