Breaking News

కంటెంట్‌ క్వీన్స్‌ మ్యాజిక్‌ : ‘యూట్యూబ్‌ విలేజ్‌’ వైరల్‌ స్టోరీ

Published on Wed, 02/19/2025 - 16:29

ఛత్తీస్‌గఢ్‌లోని ఒక చిన్న గ్రామం సోషల్‌ మీడియాలో సంచలనంగా   మారింది. రాయ్‌పూర్‌కి సమాపంలో ఉన్న తులసి అనే గ్రామం  యూ ట్యూబ్‌ (YouTube) వీడియోలతో  ఆర్థిక ,సామాజిక విప్లవాన్ని సాధించింది.  తమ కథలు, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు  YouTubeను ఒక మార్గంగా ఎంచుకున్నారు  గ్రామస్తులు. చిన్నాపెద్దా, తేడాఏమీలేదు. అక్కడందరూ కంటెంట్‌ కింగ్‌లే. అన్నట్టు ఇక్కడ యూట్యూబర్లలో మహిళలే ఎక్కువట.

అందుకే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న తులసి గ్రామాన్ని యూట్యూబర్స్ గ్రామంగా పేరుపడింది.  ఈ గ్రామంలో దాదాపు 432 కుటుంబాలుంటాయి.  వారి జనాభా 3-4వేల మధ్య ఉంటుంది. వీరిలో 1000 మంది యూట్యూబ్ ద్వారా తమ ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ గ్రామంలో నివసించే 5 ఏళ్ల చిన్నారి నుంచి 85 ఏళ్ల అమ్మమ్మ వరకు యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటారంటే అతిశయోక్తి కాదు. తమ స్పెషల్‌ స్కిట్‌లకోసం గ్రామస్తులంతా ఏకమవుతారు. ప్రతి ఒక్కరూ  తలొక పాత్ర పోషిస్తారు.

సామాజిక మార్పుకు నాంది పలికేందుకు యూట్యూబ్ ఒక వేదికగా మారిందనీ, మరింత ఆర్థిక సాధికారితను యూట్యూబ్ తీసుకువచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. యూట్యూబర్లలో, మహిళలే ఎక్కువగా ఉన్నారు. గతంలో జీవనోపాధికి తక్కువ అవకాశాలు ఉన్న మహిళలు ఇప్పుడు స్వతంత్రంగా దీని ద్వారా ఆర్జిస్తున్నారు. అంతేకాదు  చెడు అలవాట్లు, నేరాల నుండి పిల్లలను దూరంగా ఉంచుతోందంటున్నారు గ్రామస్తులు.   

ఇదీ చదవండి: చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలు

కాగా తులసి గ్రామంలో నివసిస్తున్న ఇద్దరు స్నేహితులు జైవర్మ, జ్ఞానేంద్ర 2016లో యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఉన్న జై వర్మ అంతకుముందు ఒక కోచింగ్ సెంటర్‌ను నడిపేవాడు. అందులో 11వ తరగతి నుండి పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. ఆ తర్వాత పొరుగున ఉండే జ్ఞానేంద్రతో కలిసి యూట్యూబ్‌, స్టడీ, కామెడీ వీడియోలను అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు.  ప్రారంభంలో చాలా టెక్నికల్‌ సమస్యలు,కాపీ రైట్‌ సమస్యలు వచ్చేవి. కానీ వాటన్నింటినీ అధిగమించి సక్సెస్‌ అయ్యారు. అలా ఇది మంచి ఆదాయ వనరుగా మారడంతో అందరూ అటు వైపు మళ్లారు.  మొదట్లో మొబైల్ ఫోన్‌లలో షూట్ చేసేవారు కాస్తా  ఇప్పుడు కెమెరాలు, ఇతర షూటింగ్ పరికరాలను సమకూర్చుకున్నారు.  హాస్యానికి అద్దం పట్టాలన్నా, విజ్ఞాన భాండాగారాన్ని అందించాలన్నా,  చిన్న పిల్లలనుంచీ పెద్దల వరకు అంతా సిద్ధంగా ఉంటారు.

ఇదీ చదవండి: భారీ ఊరట: ఆ మూడు కేన్సర్లకు త్వరలో వ్యాక్సీన్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)