కేన్సర్‌పై యువతి పోరు : ఆమె ధైర్యానికి సాక్షి ఈ వీడియో

Published on Sat, 03/09/2024 - 12:12

ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని కేన్సర్‌ మహమ్మారి పొట్టన పెట్టుకుంటోంది. ముందుగా గుర్తించి, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలావరకు ప్రమాదం తప్పుతుంది.  ఇది తెలియక చాలామంది ఆందోళనలో పడిపోతారు. తాజాగా చర్మ కేన్సర్‌ బారినపడి కోలుకున్న ఒక యువతి ఈ ధైర్యాన్నిస్తోంది. తీవ్రమైన మెలనోమా బారిన పడి కోలుకున్నతన జర్నీని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కేన్సర్‌ బాధల నుంచి  కోలుకున్న  వైనాన్ని రికార్డ్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియో  సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

టెక్సాస్‌లోని హ్యూస్టన్‌కు చెందిన అలోండ్రా సియెర్రా టిక్‌టాక్‌లో స్కిన్ క్యాన్సర్‌ బారిన పడింది. గత ఏడాది కాలంగా చికిత్సలు, ఆపరేషన్లను అచంచలమైన ధైర్యంతో  ఎదుర్కొంది. అంతేకాదు తనలాంటి వారికి అవగాహన కల్పించేందుకు, బలాన్నిచ్చేందుకు తాను అనుభవించిన బాధలను పంచుకుంటూ ఒక పవర్‌ఫుల్‌  సందేశాన్ని  ఇవ్వడం విశేషం. 

వయస్సు, జెండర్‌, లేదా చర్మం రంగుతో సంబంధం లేకుండా ఎవరినైనా దాడి చేసే మెలనోమా అత్యంత తీవ్రమైనదని ఇది చాలా త్వరగా విస్తరిస్తుందని కూడా హెచ్చరించింది. తగిన శ్రద్ధతో చికిత్స  తీసుకోవాలని సూచించింది. తన జుట్టును షేవ్ చేసుకోవడం నుండి మళ్లీ పొడవాటి జుట్టు దాకా, తీవ్రమై అలసట నుంచి పూర్తి ఆరోగ్యం దాకా ఇలా మొత్తం జర్నీని రికార్డు చేసింది. ‘‘నేను ముందుకు సాగడానికి తగిన శక్తిని వచ్చిన దేవునికి ధన్యవాదాలు’’ అని పేర్కొంది. దీంతో నెటిజన్లు ఆమెకు అభినందనలు అందించారు. అదృష్టవంతురాలు, ఆమె చిరునవ్వు ఇలాగే శాశ్వతంగా ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. క్రేజీ క్లిప్స్‌ షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పటికే 20  మిలియన్లకుపైగా వ్యూస్‌ దక్కించుకోవడం గమనార్హం.

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)