Breaking News

అందమైన పక్షులను వీక్షించాలనుకునే పిల్లలకోసం ఎర్లీబర్డ్‌ వర్క్‌షాప్‌

Published on Mon, 04/28/2025 - 14:36

భారతీయులలో పక్షులను  వీక్షించడం అనేది  అభిరుచిగా అభివృద్ధి చెందుతోంది. అయితే, ఆ అనుభవాన్ని మరింత అందంగా ఆనందకరమైన అనుభవంగా మిగిల్చేందుకు   ఎర్లీ బర్డ్‌ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే   ఎర్లీ బర్డ్ ప్రత్యేకంగా పిల్లల కోసం ఒక వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది.తద్వారా  పక్షుల ప్రపంచంలోకి చిన్నారులు మరింత  డీప్‌గా వెళ్లేందుకు ,ఇతర జీవరాశులను నిశితంగా గమనించే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎర్లీ బర్డ్‌ ప్రకటించింది. ఈ వర్క్‌షాప్‌ను ఆన్‌లైన్‌లో అందించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న  యంగ్‌ బర్డ్‌ లవర్స్‌ చేరాలని ఆశిస్తోంది.

మే 11 నుండి జూన్ 8 వరకు జరిగే 6వ ఎడిషన్  నిర్వహిస్తున్నట్టు ఎర్లీ బర్డ్‌  తెలిపింది. యంగ్ బర్డర్స్ వర్క్‌షాప్ 2021లో ఆన్‌లైన్ వర్క్‌షాప్‌గా ప్రారంభమైందనీ,అప్పటి నుండి ఈ ఫార్మాట్‌లో కొనసాగుతోందని పేర్కొంది. ఇప్పటివరకు, దాదాపు 200 మంది పిల్లలు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.

ఈ వర్క్‌షాప్ 10-13 సంవత్సరాల మధ్య వయస్సు గల యువ పక్షి పరిశీలకుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది 4 వారాల ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ రూపంలో ఉంటుంది. ప్రతి వారం, పాల్గొనేవారు పక్షులకు సంబంధించిన విభిన్న ఇతివృత్తాలను అన్వేషిస్తారు. ఈ సెషన్‌లు పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటాయి .మల్టీమీడియా, గైడెడ్ ఇంటరాక్షన్‌లు, ఉల్లాసమైన చర్చలు , కార్యకలాపాల మిళితంగా ఈ వర్క్‌షాప్‌   ఉండనుంది.పక్షుల గురించి లోతైన పరిశీలనలను సులభతరం చేయడానికి సంబంధించిన కథనాలు అందిస్తుంది.  ఇందులో పాల్గొనేవారు తమ ఇళ్ల చుట్టూ ఉన్న పచ్చని ప్రదేశాలను స్వతంత్రంగా అన్వేషించడంలో సహాయపడతాయి. ఇది వారి వేసవి సెలవుల్లో అద్భుతమైన అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది. వారపు ప్రత్యక్ష సెషన్‌లు వరుసగా వారాంతాల్లో ఆన్‌లైన్‌లో  అందిస్తాయిరు. ప్రతి ఒక్కటి ఎంచుకున్న థీమ్ గురించి నేర్చుకున్న విషయాలను తిరిగి పొందడమే కాకుండా పాల్గొనేవారు స్వయంగా కొనసాగించగల కొత్త కార్యకలాపాలను కూడా పంచుకునే ఇలస్ట్రేటెడ్ యాక్టివిటీ షీట్‌తో ఉంటాయి.

ఈ వర్క్‌షాప్ పాల్గొనేవారు  ఎప్పుడూ గమనించిన, తమ ఇళ్ల చుట్టూ ఉన్న వాతావరణాన్ని నిజంగా తెలుసుకోవడానికి అనుమతిస్తుందని నిర్వహికులు తెలిపారు. వర్క్‌షాప్‌కు హాజరు కావడానికి ఉచితం. కానీ  రిజిస్ట్రేషన్‌  చేసుకున్న పార్టిసిపెంట్స్‌, మెటీరియల్‌కు సంబంధించి రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. https://bit.ly/ybw_2025 అనేలింక్‌ ద్వారా వర్క్‌షాప్ రిజిస్ట్రేషన్లు  ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అలాగే విద్యావేత్తలు, తల్లిదండ్రులు , ప్రకృతి ఔత్సాహికులు ఎవరైనా వారి వారి ప్రాంతాలలోని పిల్లల కోసం ఇలాంటి వర్క్‌షాప్‌ను నిర్వహించడానికి ఆసక్తి ఉన్నవారికి, తాము'యంగ్ బర్డర్స్ కోసం వర్క్‌షాప్ నిర్వహిస్తామని కూడా ప్రకటించింది. ఈ ఉచిత గైడ్ https://early-bird.in/ybw-guideను ఎర్లీ బర్డ్ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎర్లీ బర్డ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఎ‍ర్లీ బర్డ్‌
ఎర్లీ బర్డ్ అనేది పిల్లలను పక్షులు , ప్రకృతికి దగ్గరగా తీసుకురావాలనే  ఆకాంక్షతో పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ.  నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (NCF)లో ఒక భాగం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌