Breaking News

ఇంటికీ నగధగలు

Published on Sun, 12/14/2025 - 08:13

ఆభరణాల అలంకరణ ఇంటికీ వర్తిస్తుందని ఈ డిజైన్స్‌ చూస్తేనే అర్ధమవుతుంది. సంపన్నతకు అద్దం పట్టే ఈ జ్యూలరీ స్టైల్‌ డెకర్‌ ప్రత్యేక ఈవెంట్స్‌కు మరిన్ని హంగులను చేకూరుస్తుంది. సాధారణంగా కర్టెన్‌  అలంకరణ కిటికీలకు, గుమ్మాలకు స్టయిలిష్‌ టచ్‌ను జోడించడానికి ఫ్యాబ్రిక్, డిజైన్స్‌ ఎంపికలో శ్రద్ధ కనబరచేవారు. ఇప్పుడు వాటి మీదుగా క్రిస్టల్‌ లేదా ముత్యాలు, రంగు రాళ్లు, ఇతర పూసలతో చేసిన డిజైన్లు టై–బ్యాక్‌లు, హోల్డ్‌బ్యాక్‌లు, రింగులు అంటూ కర్టెన్‌ ఆభరణాలు మరింత ఆకట్టుకునేలా అందుబాటులోకి వచ్చేశాయి. 

ముత్యాల వరస
వాడుకలో ఇవి ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. కృత్రిమ ముత్యాలు లేదా పూసల వరుసలు ప్లెయిన్‌ కర్టెన్లకు మరింత హంగునిస్తాయి.

క్రిస్టల్‌ వెలుగులు
కొన్ని డిజైన్లలో కాంతిని ఆకర్షించడానికి, గది అలంకరణకు విలాసవంతమైన అనుభూతిని జోడించడానికి వివిధ పూసలు, స్ఫటికాలు లేదా రైన్‌స్టోన్‌లు మంచి మెరుపునిస్తాయి.

లోహాల ధగధగలు
అందమైన డిజైన్‌లతో లోహపు ఆభరణాలను కర్టెన్లు ఉన్న గోడలకు సెట్‌ చేస్తారు. కొన్నిసార్లు బంగారం లేదా వెండి లోహాలతో పూసలు, క్రిస్టల్స్‌ జత చేసినవీ ఇంటికి ధగధగలనిస్తాయి

హుక్‌ రింగ్స్‌ 
కర్టెన్‌ హార్డ్‌వేర్‌ కూడా ‘నగల‘ సౌందర్యంతో అందుబాటులోకి ఉంటున్నాయి. మెటల్‌ లేదా ప్లాస్టిక్‌లో ఇవి లభిస్తాయి. ఈ రింగులు బంగారం, వెండి, రాగి లోహాలతో ఉంటాయి. వీటికి డిజైనర్లు ఆభరణాల హంగులన్నీ అద్దుతున్నారు. 

ఈ ఆభరణాలు కర్టెన్‌ రాడ్‌  చివరన, డ్రేప్‌లపైన సెట్‌ చేస్తారు. వీటిలో ఎన్నో డిజైన్ల వరకు మార్కెట్లో లభిస్తున్నాయి. లోహాలు, నాణ్యత, డిజైన్లను బట్టి వందల రూపాయల నుంచి ఎంత ఖరీదైనా తమ స్థాయిని బట్టి ఏర్పాటు చేసుకునే వీలు ఈ ‘నగలకు’ ఉంది. 
– ఎన్నార్‌
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)