Breaking News

ప్లంబర్లుగా మహిళా శక్తి!

Published on Wed, 04/30/2025 - 09:39

లింగ సమానత్వం కార్పొరేట్‌ రంగాల్లో కాదు శ్రామిక శక్తిలో చూపాలి అని నిరూపిస్తోంది జోర్డాన్‌ మహిళ. జోర్డాన్‌లో వందలాది మహిళలు ప్లంబర్లుగా విధులను నిర్వహిస్తున్నారు. మొదట్లో దీనిని అవమానకరంగా భావిస్తూ వీరి పనులపై గతంలో నిషేధం విధించారు. అక్కడి సామాజిక, సాంస్కృతిక నిబంధనల కారణంగా మహిళలు శ్రామిక శక్తిలోకి ప్రవేశించడం ఒక సవాల్‌గా ఉంది. 

ఇప్పుడు ఆ అనిశ్చితి తొలగి, జోర్డాన్‌లో మహిళా ప్లంబర్లపై ప్రభుత్వం నిషేధాన్ని తొలగించింది. 2006లో మొట్టమొదటి లైసెన్స్‌ పొందిన మహిళా ప్లంబర్‌ ఖవ్లా షేక్‌ ఈ పనిలోకి ఎక్కువ మంది మహిళలు వచ్చేలా ్ర΄ోత్సహిస్తుండగా, 2014 లో ఏర్పడిన వైజ్‌ ఉమెన్‌ ప్లంబర్స్‌ కో ఆపరేటివ్‌ ఈ రంగంలో లింగసమానత్వం సాధించడానికి కృషి చేస్తోంది. జోర్డాన్‌ సంప్రదాయ కట్టుబాట్ల కంచెను తొలగించుకుంటూ అక్కడి మహిళ తన ఉనికికోసం చేస్తున్న కృషి ప్రపంచం దృష్టిని ఆకట్టుకునేలా చేస్తోంది. 

‘స్త్రీ ఉద్యోగం చేయకూడదు, అది కుటుంబానికే అవమానం. అటువంటిది మరీ చోద్యం కాక΄ోతే పురుషులకు దీటుగా చేసే ఆ పనులేంటి..!?’ తహానీ ఆల్‌ షాతి, యుస్రా మోహమ్మద్‌ న్మోర్‌.. వంటి వాళ్లు ప్లంబర్లుగా శిక్షణ ్ర΄ారంభించినప్పుడు ఇలాంటి ఎన్నో మాటలు తమ సాటి వారి నుంచి వచ్చినవే. జోర్డాన్‌లో సామాజిక, సాంస్కృతిక నిబంధనల కారణంగా జీతంతో కూడిన పనిలో మహిళల నిష్పత్తి ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. శ్రామిక శక్తిలోకి ప్రవేశించడం ఇప్పటికీ చాలామంది మహిళలకు అతిపెద్ద సవాల్‌.

సమర్థతే సరైన ఔషధం
ప్లంబర్లుగా శిక్షణ తీసుకుంటున్న తొలి రోజులను అల్‌షాతి గుర్తుచేసుకుంది. శిక్షణ తీసుకుంటున్న ఇతర మహిళలు వీధిలో నీళ్లు లీక్‌ అవుతున్న పైపును చూశారు. లీకేజీని ఆపడానికి తమ వద్ద గల ఉపకరణాలను బయటకు తీశారు. దారినపోతున్న ఒక మహిళ వారిని చూసి ‘మీరేంటి ఈ పనులు చేయడమేంటి?’ అని తిట్టడం మొదలుపెట్టింది. దాంతో అక్కడ ఇంకొంతమంది పోగయ్యారు. 

వాళ్లు కూడా అవే మాటలు.. అవేమీ ఈ శిక్షణ తీసుకుంటున్న బృందం పట్టించుకోలేదు. నీళ్ల లీకేజీని ఆ΄ాలనుకున్న పనిని సమర్థంగా పూర్తిచేశారు. నీటినష్టాన్ని నివారించారు. దీంతో అక్కడున్నవారి నోళ్లు మూతపడ్డాయి. తమలో తాము గొణుక్కుంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ అల్‌ షాతి, న్మోర్‌ లాంటి వందలాది మహిళా సర్టిఫైడ్‌ ప్లంబర్లు ఉన్నారు. రాజధాని నగరమైన అమ్మాన్‌లోని ఈ మహిళలంతా ‘ఈ అసాధారణ కెరీర్‌ మా జీవితాలనే మార్చిందని, ఆత్మవిశ్వాసం, స్వాతంత్య్రాన్ని అందించిందని, ఇతర మహిళలకు శిక్షణ ఇస్తూ తమ దేశాన్ని పర్యటించే అవకాశాలను కల్పించిందని’ ముక్త కంఠంతో అంటున్నారు. ‘నా భర్త, పిల్లలు నన్ను చూసి చాలా గర్వపడుతుంటారు. నా పొరుగువారు నన్ను చూసి అసూయపడుతున్నారు’ అని న్మోర్‌ చెబుతుంది.

భిన్నమైన సేవ
జోర్డాన్‌లో నీటి కొరత పెద్ద సమస్య. ఇందుకు భౌగోళిక, పర్యావరణ పరమైన కారణాలు మొదటివి కాగా, నీటిని దొంగిలించడం అనేది మరో ముఖ్యమైన కారణం. అందుకే జోర్డాన్‌లో మహిళల కోసం అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. 

ఇందులో భాగంగా నీటి పొదుపు కోసం రకరకాల ఉపకరణాలను బిగించడంలో మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. నీటి వనరుల నిర్వహణలో మహిళలను పాల్గొనేలా చేయడం మంచి నిర్ణయమని నీటి, పారిశుధ్య సలహాదారు హింద్‌ అల్లైఫాత్‌ పేర్కొన్నారు. ఎందుకంటే నీటి ప్రాముఖ్యత గురించి వారికే  ఎక్కువ తెలుసు. ఈ మేరకు వారు యువత, వృద్ధులలో అవగాహనను తీసుకు రాగలరు. ఈ కోణంలో చూసినపుడు వారు తల్లులే కాదు, టీచర్లు కూడా!

ఆర్థిక భద్రత
అల్‌ షాతి, న్మోర్‌ తో సహా కొంతమంది మహిళా ప్లంబర్లు 2014లో వైజ్‌ ఉమెన్‌ ప్లంబర్స్‌ కో ఆపరేటివ్‌ కార్యక్రమంలో చేరారు. కలిసి పనిచేయడం వల్ల భద్రత, ఆర్థిక స్థిరత్వం, అలాగే పెద్ద ప్రాజెక్టులను లీడ్‌ చేసే అవకాశాలు లభిస్తాయనేది వీరి ఆలోచన. ఇందులోని సభ్యులు తమ చుట్టుపక్కల ఇళ్లకు వెళ్లి ఉచిత సర్వీస్‌ అందిస్తున్నారు.

మొదటిసారి 2004లో 15 మంది మహిళలతో కలిసి శిక్షణ తీసుకున్నప్పుడు ‘సంస్కృతికే అవమానం’ అనే కారణంగా ఇతరులెవరూ దానిని ఆమోదించలేదు. కానీ, ‘‘నేడు ఈ పనిరాని వారు కూడా సాధారణ మరమ్మతులు చేయడం నేర్చుకుంటే ఇండ్లలో తమ ప్లంబర్‌ పనిని తామే చేసుకోవచ్చు’ అని వివరిస్తూ తోటి మహిళలనూ ప్రోత్సహిస్తున్నారు. ఇలా ప్లంబర్‌ పనిచేసే ఈ మహిళలంతా చాలా కాలంగా తమ సమాజంలోని నిబంధనలను సవాల్‌ చేస్తూ తమ ఉనికిని చాటుతున్నారు. లింగ సమానత్వాన్ని కాపాడుకున్నారు. 

(చదవండి: 'రోబోటిక్ కేక్'..! శాస్త్రవేత్తలు, పేస్ట్రీ చెఫ్‌ల పాక నైపుణ్యం)
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)